బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్, ఏఎన్‌యూ ఆల్ రిజర్వేషన్ ఎంప్లాయిస్ అండ్ స్టూడెంట్ యూనియన్ ఇటీవల సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని యూనివర్సిటీ చేపట్టనున్న బ్యాక్లాగ్ పోస్టులకు మరలా నోటిఫికేషన్ జారీ చేయాలని యూనివర్సిటీ ఎంప్లాయిస్ అండ్ స్టూడెంట్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి మరలా నోటిఫికేషన్ జారీ చేయాలని డియాండ్ చేస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస అండ్ స్టూడెంట్ యూనియన్ ప్రత్యక్ష ఆందోళన చేపట్టబోతోందని దానిలో తమ సంఘం కూడా పాల్గొంటుందని పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎం.సురేష్‌కుమార్, వి.జయరావు తదితరులు ఉన్నారు.
రిజర్వేషన్ ఎంపాయీస యూనియన్‌కు బీసీ సంఘం మద్దతు
బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో యూనివర్సిటీ ఆల్ రిజర్వేషన్ ఎంప్లాయిస్ అండ్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టే అన్ని కార్యక్రమాలకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని యూనివర్సిటీ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2007లో ప్రకటించిన బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రాపోలు భావనారుషి, ఎంవీ ప్రసాదరావు తదితరులు ఉన్నారు.