గ్రామస్థాయికి బ్రహ్మకుమారీస్ సేవలు: హరీష్
హైదరాబాద్: ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనలను పెంపొం దించే విశ్వపిత బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయ సేవలను గ్రామీణ స్థాయికి విస్తరించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖమంత్రి హరీష్రావు అన్నారు. బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్లో ఆదివారం జరిగిన ‘అవేకింగ్ ది రూలర్ విత్ఇన్ ఎక్స్లెన్స్ ఇన్ అడ్మినిష్ట్రేషన్’ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. ధ్యానం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలు ప్రసంశనీయమమన్నారు.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 14 ఏళ్లుగా హైకోర్టు న్యాయమూర్తిగా ఉండి 69 వేల కేసులను పరిశీలించానని, అప్పట్లో సైతం ఎలాంటి ఒత్తిడికి గురికాకపోవడానికి ధ్యానమే కారణమన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు, విదేశీ యువతులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఢిల్లీ ఓంశాంతి రీట్రీట్ సెంటర్ డెరైక్టర్ బీకే ఆశా, విశ్రాంత విజిలెన్స్ కమిషనర్ రజనీకుమారి, గచ్చిబౌలి శాంతిసరోవర్ డెరైక్టర్ బీకే కులదీప్జీ, ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ సివిఆర్ రాజేంద్రన్, ఇన్కంటాక్స్ కమిషనర్ దత్తా తదితరులు పాల్గొన్నారు.