భవిష్యత్ టీచర్.. ట్వీటర్
వాషింగ్టన్: సోషల్ మీడియా ట్వీటర్‌ను విద్యార్థులు విద్యా విషయాల్లో సమర్థంగా ఉపయోగించుకుంటే పాఠాలు చెప్పే టీచర్‌గా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ట్వీటర్‌తో స్కూల్లో చెప్పిన పాఠాలకు అదనపు సమాచారాన్ని రాబట్టవచ్చని చెప్పా రు. ఎనిమిదో తరగతి సైన్స్ విద్యార్థులు ట్వీటర్‌ను బోధన సాధనంగా ఉపయోగించి మంచి ఫలితాలు పొందారని అమెరికాలోని వెర్మాంట్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు ట్వీటర్ ద్వారా సైన్స్‌పై పూర్తి అవగాహన, సైన్స్ ప్రయోగాలకు ప్రేక్షకులను పెంచుకోవడం, రోజువారీ ఘటనలను సైన్స్‌తో పోల్చుకోవడం, కొత్త విధానంలో సైన్స్ గురించి కమ్యూనికేట్ చేయడం వంటివాటిలో పురోగతి సాధించామన్నారు.