unmarried couples
-
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఓయో (OYO) పెళ్లికాని జంటలకు షాకిచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు తన భాగస్వామి హోటల్లకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.మొదటగా మీరట్ నుంచి..మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని దేశంలోని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో రూమ్స్ ఉపయోగించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 58 శాతం పెరిగింది.పెళ్లికాని జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పౌర సమాజ సమూహాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఓయో రూమ్స్ దుర్వినియోగంపై ముఖ్యంగా మీరట్‌లో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ నుంచే ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓయోపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభూతిని అందించే బ్రాండ్‌గా తనను తాను రూపొందించుకోవడం లక్ష్యంగా కంపెనీ ఈ చొరవ తీసుకున్నట్లు ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.సురక్షితమైన ఆతిథ్య పద్ధతులపై పోలీసులు, హోటల్ భాగస్వాములతో కలిసి సదస్సులను నిర్వహించడంతోపాటు అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం, ఓయో బ్రాండింగ్‌ని అనధికారిక ఉపయోగించే హోటళ్లపై చర్యలు తీసుకోవడం వంటి అనేక దేశవ్యాప్త కార్యక్రమాలను ఓయో ప్రారంభించింది. -
లవర్స్‌కు షాకిచ్చిన ఇందిరా పార్క్: వెనక్కి తగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రముఖ పార్క్‌లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్మెంట్ కొత్త మోరల్ పోలీసింగ్ వ్యవహారం దుమారాన్ని రేపింది. పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్‌కి అంటూ ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు మండిపడ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ అనుమతినిచ్చే ప్రదేశం. పార్క్‌లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్ మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ అంటే చాలా ఫ్యామస్. ఈ పార్క్‌ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడవం గమనార్హం. చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి New low & new level of moral policing by Indira Park Mgmt in Hyd! A public park is an open space for all law abiding citizens, including consenting couples across genders. How can 'marriage' be criteria for entry! @GHMCOnline & @GadwalvijayaTRS this is clearly unconstitutional. pic.twitter.com/4rNWo2RHZE — Meera Sanghamitra (@meeracomposes) August 26, 2021 -
బైక్‌పై వెళ్తున్న జంటపై దాడి..
గువాహటి : నైతికత పేరుతో బైక్‌పై వెళ్తున్న జంటపై అస్సాంలోని పుకుర్‌పూర్ వాసులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాల్సిందిగా వారిపై ఒత్తిడి తెచ్చారు. జూన్19న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై గ్రామస్థుల చేతిలో దాడికి గురైన యువకుడి సోదరుడు మాట్లాడుతూ.. ‘బైక్‌పై వెళ్తున్న జంటను అడ్డగించిన గ్రామస్థులు.. యువతి, యువకులు జంటగా వెళ్లడంపై అభ్యంతరం తెలిపి దూషణలకు దిగారు. దానిని తప్పుగా భావించి వారిపై దాడి చేశారు. ఊరిలో సమావేశం ఏర్పాటు చేసి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ జంటపై ఒత్తిడి తీసుకుచ్చారు’ అని తెలిపారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అస్సాం డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పోలీసులే ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపడుతున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. -
ఇక పెళ్లికాని జంటలకు రూములిస్తారట
బెంగళూరు: ఇక పెళ్లికాని యువ జంటలకు కూడా రూములు అద్దెకు ఇస్తామని ఓయో సంస్థ ప్రకటించింది. రెండు నెలల కింద ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఇక దానిని అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో 70 వేల గదులను అద్దెకు ఇస్తున్న ఈ సంస్థ వాటిల్లో 60శాతం గదులను పెళ్లికానీ యువజంటలకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక సైట్, యాప్ ద్వారా కూడా వాటిని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రూమ్ కావాలని వచ్చిన వారు తమ స్థానికతకు సంబంధించిన దస్తావేజులు చూపించిన వెంటనే వారికి ఈ సౌకర్యం ఓయో కల్పించనుంది. అంతేకాకుండా.. కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ ను మెట్రో నగరాలతోపాటు ప్రముఖమైన 100 పట్టణాల్లో ప్రారంభించింది. ఓయో రూమ్స్‌ను ఓ జపాన్ టెలికం సంస్థ, ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ సహాయంతో ప్రారంభించారు. -
పెళ్లి కాని జంటల కోసం..
పెళ్లయిపోయిన వాళ్ల మాట ఏమోగానీ.. పెళ్లికాని ప్రేమికులు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపాలంటే చాలా కష్టం. వాళ్లకు గదులు దొరకవు. ఒకవేళ ఏదైనా హోటల్లో గది తీసుకుందామన్నా పోలీసులతో ఇబ్బందే. ఈ సమస్యను గుర్తించిన బిట్స్ పిలానీ మాజీ విద్యార్థి సంచిత్ సేథి ఓ పరిష్కారం కనుగొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లతో అనుసంధానం అయ్యేలా 'స్టే అంకుల్' అనే కొత్త స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. ఈ హోటళ్లలో పెళ్లికాని జంటలు కూడా ఎంచక్కా గడపొచ్చు. వెబ్సైట్లో ఉన్న జాబితాలో ఉండే హోటళ్లలో 10-12 గంటల పాటు గడపొచ్చు. కావాలనుకుంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు లేదా, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు ఉండొచ్చు. ఇందుకు అద్దె రూ. 2వేల నుంచి రూ. 6వేల వరకు ఉంటుంది. ఈ వెబ్సైట్ ప్రారంభించిన కొత్తలో పర్యాటకులు ఎక్కువగా వస్తారని అనుకున్నారు. కానీ పెళ్లికాని జంటల నుంచి పదేపదే తమకు హోటల్ గదులు కావాలని రిక్వెస్టులు రావడంతో అటుదిశగా చర్యలు ప్రారంభించారు. నిజానికి భారతదేశంలో చట్టాల ప్రకారం పెళ్లికాని జంటలు గది అద్దెకు తీసుకోకూడదని ఎక్కడా లేదని, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా గది అద్దెకు తీసుకోవచ్చని సంచిత్ సేథి చెప్పారు. కొన్ని హోటళ్ల వారు ఇందుకోసం ముందుకొచ్చినా, బహిరంగంగా చెప్పలేకపోతున్నారని, ఈ ఆలోచనా ధోరణిని మార్చాలన్నదే తన ప్రయత్నమని అన్నారు. తమ జాబితాలో ఉన్నవాటిలో చాలావరకు ప్రముఖ ప్రైవేటు హోటళ్లేనని చెప్పారు.