unwanted sms
-
తప్పని అవాంఛిత కాల్స్ బెడద - సర్వేలో బయటపడ్డ విషయాలు
డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) లిస్ట్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది మొబైల్ ఫోన్ యూజర్లకు అవాంఛిత కాల్స్ బెడద తప్పడం లేదు. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇతరత్రా ఉత్పత్తుల గురించి తమకు స్పామ్ కాల్స్ వస్తూనే ఉన్నాయంటూ లోకల్‌సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది తెలిపారు. సర్వేలో అడిగిన ఏడు ప్రశ్నలకు 378 జిల్లాల నుంచి 60,000 పైచిలుకు సమాధానాలు వచ్చినట్లు లోకల్‌సర్కిల్స్ తెలిపింది. గతేడాది నవంబర్ 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 16 మధ్య కాలంలో దీన్ని నిర్వహించారు. అవాంఛిత కాల్స్ సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు రోజుకు తమకు 1–2 కాల్స్ వస్తూనే ఉంటాయని 90 శాతం మంది, 10కి పైగా కాల్స్ వస్తుంటాయని 3 శాతం మంది పేర్కొన్నారు. ఒక బడా లిస్టెడ్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అత్యధికంగా కాల్స్ ఉంటున్నాయని 40 శాతం మంది వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక పేరొందిన లిస్టెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఉంది. అవాంఛిత కాల్స్‌ను కట్టడి చేసేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గత కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించడం లేదని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా చెప్పారు. -
ఇబ్బంది పెట్టే కాల్స్, సందేశాలకు చెక్!
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీపై పనిచేస్తున్నట్టు టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ ప్రకటించింది. ఆర్థిక మోసాల నివారణకు ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ‘‘అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే సంప్రదింపులు అన్నవి ప్రజలను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా అధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పలు అనుచిత సందేశాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఇబ్బంది పెట్టే కాల్స్‌ను కూడా ఒకే రీతిలో చూడడమే కాకుండా, పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’అని ట్రాయ్ పేర్కొంది. అనుమతి లేని వాణిజ్య సంప్రదింపులకు చెక్ పెట్టేందుకు పలు భాగస్వామ్య సంస్థలో కలసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్ తెలిపింది. -
అడ్మిన్ తలచుకుంటే..!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ యాప్ ‘వాట్సాప్’.. గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు అప్పగించనుంది. అనవసర సందేశాలు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోస్టు చేస్తూ.. గ్రూపులోని మిగిలిన సభ్యులను ఇబ్బందిపెడుతున్న వారిని నియంత్రించేలా యాప్‌లో మార్పులు చేస్తోంది. అడ్మిన్ తలచుకుంటే ఇలాంటి సందేశాలను నిలిపేయవచ్చని.. కొత్త సాంకేతికతను పరీక్షించే డబ్ల్యూఏ బీటా ఇన్ఫో వెబ్సైట్ వెల్లడించింది. గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.430లో ఈ సదుపాయం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయాన్ని కేవలం గ్రూపు అడ్మిన్లు మాత్రమే వినియోగించుకోవచ్చు. ఒక్కసారి సదరు సభ్యుడిని ఈ జాబితాలో చేరిస్తే.. ఆ సభ్యుడు గ్రూపులోని ఇతరులు పంపే సందేశాలను చదివేందుకు మాత్రమే వీలుంటుంది. తన సందేశాన్ని గ్రూపు సభ్యులందరికీ చేరవేయాలనుకుంటే సందేశాన్ని టైప్ చేసి ‘మెసేజ్ అడ్మిన్’ బటన్ నొక్కాల్సి ఉంటుంది. దీన్ని అడ్మిన్ ధ్రువీకరిస్తేనే ఈ మెసేజ్‌లు పోస్ట్ అవుతాయి. -
మధురిమకు అశ్లీల ఎస్ఎంఎస్లు
తనకు సెల్‌ఫోన్ ద్వారా అశ్లీల ఎస్ఎంఎస్లు పంపుతూ దుష్ర్పచారం చేస్తున్న తనమాజీ మేనేజర్‌పై నటి మధురిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగడాలు ఆగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇంతకుముందు నటి శృతిహాసన్, రమ్య తదితర హీరోయిన్లకు ఇలా అశ్లీల ఎస్ఎంఎస్లు పంపి అల్లరి చేసిన ఆకతాయిలపై ఫిర్యాదు చేయగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా నటి మధురిమపై ఆమె మాజీ మేనేజర్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారట. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా ఎదుగుతున్న నటి మధురిమ. తన సెల్‌ఫోన్‌కు తరచూ అశ్లీల ఎస్ఎంఎస్లు వస్తున్నాయని, వాటికి కారణమెవరో తనకు తెలిసిందని మధురిమ పేర్కొన్నారు. తన మాజీ మనేజర్ అశ్లీల ఎస్ఎంఎస్లు పంపించడంతో పాటు తనను, పలువురు చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల నుంచి తొలగించారన్న దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన దర్శక నిర్మాతలు అతని మాటలు నమ్మలేదన్నారు. అతనిపై ఫిర్యాదు చేస్తారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి సహనంగానే ఉన్నానని చెప్పారు.