మధురిమకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు | Actress Madhurima Harassed By offensive SMS | Sakshi
Sakshi News home page

మధురిమకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు

Published Wed, Dec 11 2013 4:43 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

మధురిమకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు - Sakshi

మధురిమకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు

తనకు సెల్‌ఫోన్ ద్వారా అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ దుష్ర్పచారం చేస్తున్న తనమాజీ మేనేజర్‌పై నటి మధురిమ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆగడాలు ఆగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇంతకుముందు నటి శృతిహాసన్, రమ్య తదితర హీరోయిన్లకు ఇలా అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపి అల్లరి చేసిన ఆకతాయిలపై ఫిర్యాదు చేయగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా నటి మధురిమపై ఆమె మాజీ మేనేజర్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారట. 
 
 తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఎదుగుతున్న నటి మధురిమ. తన సెల్‌ఫోన్‌కు తరచూ అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని, వాటికి కారణమెవరో తనకు తెలిసిందని మధురిమ పేర్కొన్నారు. తన మాజీ మనేజర్  అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపించడంతో పాటు తనను, పలువురు చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల నుంచి తొలగించారన్న దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన దర్శక నిర్మాతలు అతని మాటలు నమ్మలేదన్నారు. అతనిపై ఫిర్యాదు  చేస్తారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి సహనంగానే ఉన్నానని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement