నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు
స్టేషన్‌ఘన్‌పూర్(జనగామ): జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలాన్ని వరంగల్ అర్బన్‌లో కలపాలంటూ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మండలంలోని చిన్నపెండ్యాలలో ఉపేందర్‌రావు అనే నాయకుడు గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు.
పలువురు ప్రజాప్రతినిధులు నచ్చజెప్పినా వినకపోవటంతో శనివారం ఉదయం పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.