urban india
-
ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు..
న్యూఢిల్లీ: నగరాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. మెట్రోలు, టైర్ 1 నగరాల్లో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరగనున్నదని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ నివేదిక తెలిపింది. పదిలక్షలకు మించిన జనాభా ఉన్న 35 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందిన ఈ నివేదికన ప్రకారం.. 2013లో 1.6 కోట్లుగా ఉన్న మహిళా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30% వృద్ధితో ఈ ఏడాది 2.07 కోట్లకు పెరగొచ్చని అంచనా. పట్టణాల్లో పురుషుల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్‌కల్లా భారత్‌లో 24.3 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నారని అంచనా. ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో అధిక వృద్ధి కళాశాల విద్యార్ధుల విభాగంలో ఉంది. గత ఏడాది 45.1 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య ఈ ఏడాది 62% వృద్ధితో 72.9 లక్షలకు చేరింది. పట్టణాల్లో నెట్‌ను వాడుతున్న పాఠశాల బాలి కల సంఖ్య గతేడాది 21.5 లక్షలు కాగా.. ఈ ఏడాది 34% వృద్ధితో 28.8 లక్షలకు చేరింది. ఉద్యోగినులు కాని మహిళల సంఖ్య 49.3 లక్షల నుంచి 18% వృద్ధితో 58.3 శాతానికి పెరిగింది. ఇక ఉద్యోగినుల సంఖ్య 44.1 లక్షల నుంచి 8 శాతం వృద్ధితో 47.7 లక్షలకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో రోజూ ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్న వారిలో ఉద్యోగినుల్లో 60% మంది, ఉద్యోగినులు కాని వారు 40% మంది ఉన్నారు. -
హైదరాబాద్ చూసేందుకు అందరికీ ఆసక్తి
దేశంలో పట్టణీకరణ ఇంకా బాగా పెరగాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పట్టణాల్లో కాలుష్య సమస్య మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. మెట్రోపొలిస్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 46 శాతం ప్రజలు పట్టణాల్లోనే ఉన్నారని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉద్యోగం లాంటి అవసరాల కోసం పల్లె ప్రజలు కూడా పట్టణాల బాట పడుతున్నారని చెప్పారు. మొత్తం ప్రపంచంలో చూసుకుంటే 60 శాతం జనాభా పట్టణాల్లోనే ఉందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని నగరాల మధ్య అవగాహన, అభిప్రాయాల మార్పిడికి మెట్రోపొలిస్ వేదికగా నిలిచిందని వెంకయ్య అన్నారు. అభివది్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌ను చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు.