హైదరాబాద్ చూసేందుకు అందరికీ ఆసక్తి
దేశంలో పట్టణీకరణ ఇంకా బాగా పెరగాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పట్టణాల్లో కాలుష్య సమస్య మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. మెట్రోపొలిస్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 46 శాతం ప్రజలు పట్టణాల్లోనే ఉన్నారని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉద్యోగం లాంటి అవసరాల కోసం పల్లె ప్రజలు కూడా పట్టణాల బాట పడుతున్నారని చెప్పారు. మొత్తం ప్రపంచంలో చూసుకుంటే 60 శాతం జనాభా పట్టణాల్లోనే ఉందని ఆయన తెలిపారు.
ప్రపంచంలోని నగరాల మధ్య అవగాహన, అభిప్రాయాల మార్పిడికి మెట్రోపొలిస్ వేదికగా నిలిచిందని వెంకయ్య అన్నారు. అభివది్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ను చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు.