ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు.. | Women driving Internet user growth in urban India: IAMAI-IMRB | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు..

Published Thu, Nov 13 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు..

ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు..

న్యూఢిల్లీ: నగరాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. మెట్రోలు, టైర్ 1 నగరాల్లో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరగనున్నదని ఐఏఎంఏఐ-ఐఎంఆర్‌బీ నివేదిక తెలిపింది.  పదిలక్షలకు మించిన జనాభా ఉన్న 35 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందిన

ఈ నివేదికన  ప్రకారం..
 2013లో 1.6 కోట్లుగా ఉన్న మహిళా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30% వృద్ధితో ఈ ఏడాది 2.07 కోట్లకు పెరగొచ్చని అంచనా.
 పట్టణాల్లో పురుషుల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 శాతం పెరిగింది.
 ఈ ఏడాది జూన్‌కల్లా భారత్‌లో 24.3 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నారని అంచనా.
 ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో అధిక వృద్ధి కళాశాల విద్యార్ధుల విభాగంలో ఉంది. గత ఏడాది 45.1 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య ఈ ఏడాది 62%  వృద్ధితో 72.9 లక్షలకు చేరింది.


పట్టణాల్లో నెట్‌ను వాడుతున్న పాఠశాల బాలి కల సంఖ్య గతేడాది 21.5 లక్షలు కాగా..  ఈ ఏడాది 34% వృద్ధితో 28.8 లక్షలకు చేరింది.
ఉద్యోగినులు కాని మహిళల సంఖ్య 49.3 లక్షల నుంచి 18% వృద్ధితో 58.3 శాతానికి పెరిగింది.
ఇక ఉద్యోగినుల సంఖ్య 44.1 లక్షల నుంచి 8 శాతం వృద్ధితో 47.7 లక్షలకు పెరిగింది.
పట్టణ ప్రాంతాల్లో రోజూ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తున్న వారిలో ఉద్యోగినుల్లో 60% మంది, ఉద్యోగినులు కాని వారు 40% మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement