urban poor
-
Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!
ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్‌లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్‌ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.బెంగళూరులోని శాంతి నగర్లో ఉన్న ‘అనాహత్’ క్లినిక్‌కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్‌ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్‌లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్. ఆమె ఈ క్లినిక్ నిర్వాహకురాలు.10 వేల మందికి ఒక క్లినిక్బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్. జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్ క్లినిక్’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్ సంకల్పం. నేరుగా క్లినిక్‌కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్ క్యాంప్స్ ద్వారా స్లమ్స్‌లో వైద్య చికిత్స అందించడం అనాహత్ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్ క్యాంప్స్ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్ చేయూతతో.బీపీ, షుగర్ బాధితులు‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వారికి షుగర్ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్‌కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్‌ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు. 70 రకాల పరీక్షలుఅనాహత్ క్లినిక్‌లో 70 రకాల టెస్ట్‌లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్‌ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్‌గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్‌లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్‌ను అభిమానిస్తున్నారు.‘స్లమ్స్‌లో ఉన్నవారు క్లినిక్స్‌కు రారు. స్లమ్స్‌లో హెల్త్ క్యాంప్స్ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ. -
ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త పథకం!
New Housing Loan Subsidy Scheme: పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. “మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కొనాలని, కట్టుకోవాలని కలలు కంటున్నాయి. నగరాల్లోని మురికివాడల్లో, అద్దె ఇళ్లల్లో నివసిస్తూ కాలం వెల్లదీస్తున్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే కొత్త పథకాన్ని రాబోయే సంవత్సరాల్లో తీసుకురాబోతున్నాం. వారు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు వడ్డీ రాయితోపాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం ” అని మోదీ చెప్పారు. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు సెప్టెంబర్ నెలలో తీసుకొచ్చే కొత్త పథకం ఇప్పుడున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి పొడిగింపు. అయితే కొత్త పథకంలో వడ్డీ రాయితీని పొందే అర్హతను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంలో సామర్లకోటకు అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర పట్ణణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ‘అర్బన్ హౌసింగ్ కాన్క్లేవ్’లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో బెస్ట్ పెర్ఫార్మింగ్ మునిసిపల్ కౌన్సిల్‌గా సామర్లకోటకు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ లభించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి హరదీప్‌సింగ్ పురీ చేతుల మీదుగా ఏపీ టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్ గురువారం అందుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కాన్క్లేవ్లో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తోన్న ఇళ్లు, వైఎస్సార్, జగనన్న కాలనీల స్టాల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
TIDCO Houses: వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని సారిపల్లిలో నిర్మించిన 800 యూనిట్లను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందచేసింది. ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం మున్సిపాలిటీలోని పాత్రునివలస–1లో మరో 800 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. తాగునీరు, రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు, ఎస్టీపీలు లాంటి మౌలిక వసతులు కల్పిస్తూ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో సిద్ధమైన 29,572 యూనిట్లను వరుసగా పంపిణీ చేసేందుకు టిడ్కో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నాడు ఎన్నికలకు ముందు అరకొరగా... రాష్ట్రవ్యాప్తంగా 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 36,064 ఇళ్లను లబ్ధిదారులకు వైఎస్సార్ ప్రభుత్వం ఒక్క రూపాయికే అందిస్తోంది. 365 చ.అ విస్తీర్ణంలోవి 13,968 ఇళ్లు, 430 చ.అడుగుల్లోవి మరో 21,040 యూనిట్లు ఉన్నాయి. వీటిని 50 శాతం రాయితీతో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులపై భారం మోపుతూ ఎన్నికల ముందు అరకొరగా టిడ్కో ఇళ్లను చేపట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి మౌలిక సదుపాయాలతో వీటిని సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రోడ్లు, పార్కులతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ, మరీ ముఖ్యంగా ప్రతి నిర్మాణానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మించిన తర్వాతే లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఈమేరకు సర్వ హంగులతో టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి. పేదలపై రిజిస్ట్రేషన్ల భారం పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 98 పట్టణ స్థానిక సంస్థల్లో మూడు విభాగాల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్ నాటికి 1.32 లక్షలకుపైగా యూనిట్లను లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో చురుగ్గా పనులు సాగుతున్నాయి. మిగిలిన ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అన్ని సదుపాయాలతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందించనున్నారు. పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనతోపాటు రిజిస్ట్రేషన్లను సైతం ఉచితంగా చేసి ప్రభుత్వం అందిస్తోంది. ఒక్క రిజిస్ట్రేషన్ల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకుపైగా భారాన్ని భరిస్తుండటం గమనార్హం. -
పట్టణ పేదల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ టాప్
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ వన్‌గా నిలిచింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2019–20కు గాను రూపొందించిన ‘సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైం (స్పార్క్) ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. రాష్ట్రంలోని పట్టణాల్లో 24 లక్షల మంది పేద మహిళలను సంఘటితం చేసిన రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2.4 లక్షల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఉపాధి కల్పన పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించింది. మొదటి స్థానంలో నిలిచినందుకు మెప్మాకు రూ.12 కోట్లు ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటించిందని మెప్మా ఇన్చార్జి ఎండీ సంపత్‌కుమార్ వివరించారు. చదవండి: (4 లేన్లుగా కరకట్ట రోడ్డు.. రూ.150 కోట్లతో విస్తరణ) -
పట్టణ పేదలకోసం కొత్త రెంటల్ పాలసీ
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదల కోసం మరోకొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. 100 స్మార్ట్ నగరాల్లో న్యూ రెంటల్ పాలసీని ప్రారంభించనుంది. ఆ ప్రణాళిక మొదటి భాగం వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి అమల్లోకి తేవచ్చని తెలుస్తోంది. గత 3 సంవత్సరాలుగా దీనిపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అమల్లోకి తేనుందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ప్రధానమంత్రి హైసింగ్ పథకంలో భాగంగా అందరికీ గృహ సదుపాయం లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో త్వరలోనే కేబినోట్ ను తయారు చేయనుందని పేర్కొంది. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంచినట్టు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నివేదించింది. ప్రాథమికంగా 100 స్మార్ట్ నగరాలలో పట్టణ పేద లక్ష్యంగా ప్రారంభించబోతున్న ఈ సంక్షేమ పథకానికి రూ.2700కోట్లను కేటాయించింది. వలస కార్మికులకు, పట్టణ పేదలకు దీనికి సంబంధించిన రెంటల్ వోచర్లను పంపిణీ చేస్తుంది. స్థానిక ప్రజా సంస్థల ద్వారా వీటిని లబ్దిదారులకు అందించనున్నారు. అలాగే ఆయా పేదల అద్దె గృహాల అద్దెతదితర వివరాలను ఈ లోకల్‌బాడీలే నిర్ణయిస్తాయట. నిర్దేశిత వోచర్లకు విలువకు మించి అద్దె చెల్లించాల్సి వస్తే.. మిగిలిన నగదును అద్దెదారుడే భరించాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ అధికారి వివరించారు. -
తెలంగాణకు 10,290, ఏపీకి 1,93,147 ఇళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ 2,28,204 ఇళ్లను మంజూరు చేసింది. ఈమేరకు మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణాలకు గాను కేంద్రం రూ. 3,231 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది. అందరికి ఇల్లు పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 37 పట్టణాలకు 1,93,147, తెలంగాణలోని 10 పట్టణాలకు 10,290 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా, గుజరాత్‌లోని 4 పట్టణాలకు 15,580, రాజస్తాన్‌లోని 10 పట్టణాలకు 6,255, తమిళనాడులోని 5 పట్టణాలకు 2,932 ఇళ్లను మంజూరు చేసింది. కేంద్రం ఆర్థిక సహాయం కింద ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షలు అందించనుంది. ఇళ్ల నిర్మాణాల పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు భూములను కేటాయించాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. -
305 నగరాల్లో ‘అందరికీ ఇళ్లు’
తొమ్మిది రాష్ట్రాల్లో గుర్తించిన కేంద్ర ప్రభుత్వం * జాబితాలో తెలంగాణలోని 34 నగరాలు, పట్టణాలకు చోటు న్యూఢిల్లీ: పట్టణ పేదల కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ‘అందరికీ ఇళ్లు’ను అమలు చేసేందుకు దేశంలోని 9 రాష్ట్రాల నుంచి 305 నగరాలు, పట్టణాలను కేంద్రం గుర్తించింది. తెలంగాణలోని 34 నగరాలు, పట్టణాలు వీటిలో ఉన్నాయి. త్వరలోనే ఈ నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన(హెచ్‌యూపీఏ) శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే ఆరేళ్ల వ్యవధిలో రెండు కోట్ల మంది పట్టణ పేదలకు సొంత ఇళ్లు నిర్మించేందుకు హెచ్‌యూపీఏ మంత్రిత్వ శాఖ రూ. 2 లక్షల కోట్లను వ్యయం చేయనుంది. ఈ పథకానికి తెలంగాణలోని 34 పట్టణాలు, నగరాలతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి 36, గుజరాత్ 30, జమ్మూకశ్మీర్ 19, జార్ఖండ్ 15, కేరళ 15, మధ్యప్రదేశ్ 74, ఒడిశా 42, రాజస్థాన్ నుంచి 40 నగరాలు, పట్టణాలను కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన 9 రాష్ట్రాలతో పాటు మరో ఆరు రాష్ట్రాలు ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ఆరు తప్పనిసరి సంస్కరణలు అమలు కోసం హెచ్‌యూపీఏతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, బిహార్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఒప్పందం ప్రకారం లేఅవుట్ ప్రతిపాదనలు, నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో ద్వారా నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతులు ఇవ్వాలి. ఆర్థికంగా వెనుకబడిన, అల్పా దాయ వర్గాల ఇళ్ల నిర్మాణానికి తక్కువ నిర్మాణ ప్రాంతంలోనూ నిర్మాణ అనుమతులు ఇవ్వాలి. అద్దె చట్టాలకు హెచ్‌యూపీఏ సూచించిన మార్పులు చేయాలి. తక్కువ వ్యయ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు, మురికివాడలను అభివృద్ధికి సాంద్రత నిబంధనల సరళీకరణ వంటి సవరణలు చేయాలి. పట్టణ ఇళ్ల నిర్మాణ మిషన్‌లో భాగంగా కేంద్రం ఒక్కో యూనిట్‌కు రూ. లక్ష నుంచి రూ. 2.3 లక్షలను సహాయంగా అందజేస్తుంది.