సాక్షి, అమరావతి: పట్టణ పేదల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ వన్‌గా నిలిచింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2019–20కు గాను రూపొందించిన ‘సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైం (స్పార్క్) ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది.
రాష్ట్రంలోని పట్టణాల్లో 24 లక్షల మంది పేద మహిళలను సంఘటితం చేసిన రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2.4 లక్షల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఉపాధి కల్పన పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించింది. మొదటి స్థానంలో నిలిచినందుకు మెప్మాకు రూ.12 కోట్లు ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటించిందని మెప్మా ఇన్‌చార్జి ఎండీ సంపత్‌కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment