అనారోగ్యం పేరుతో డ్యూటీకి డుమ్మా
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పరిస్థితి నానాటికీ బలహీనంగా మారుతోంది. తన అధీనంలోని భూభాగాల సరిహద్దుల్లో శత్రుదళాలతో పోరాడాల్సిన మిలిటెంట్లు అనారోగ్యం సాకుతో విధులను తప్పించుకుంటున్నారు. ఇందుకోసం ఫైటర్లు డాక్టర్ల దగ్గరి నుంచి ధ్రువపత్రాలు తెచ్చి అందజేస్తున్నారు. ఇది వరకే ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ లోపాలతో ఇబ్బందిపడుతున్న ఐఎస్‌కు ఈ పరిణామం మింగుడుపడటం లేదు.
ఐఎస్ కోశాగారాలు, చమురు నిల్వల కేంద్రాలపై అమెరికా తరచూ దాడులు చేస్తుండడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఫలితంగా ఫైటర్ల జీతాలను సగానికి తగ్గించింది. దీంతో చాలా మంది సంస్థను వీడేందుకు సాకులు వెతుకుంటున్నారని అమెరికా సైనికవర్గాలు తెలిపాయి.