సీమా వర్మ ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్: అమెరికాలో కీలకమైన హెల్త్ కేర్ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతికి చెందిన సీమా వర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ట్రంప్ యంత్రాంగంలో అడుగిడిన రెండో ఇండో– అమెరికన్‌గా వర్మ గుర్తింపు పొందారు. 55– 43 ఓట్ల తేడాతో సెనేట్ ఆమెను ఎన్నుకున్నట్లు శ్వేత సౌధ వర్గాలు వెల్లడించాయి. దీంతో 130 మిలియన్ల మందికి వైద్య సేవలు అందించే ‘మెడికేర్ అండ్ మెడికెయిడ్ సర్వీస్ సెంటర్ల’కు అధిపతిగా వర్మ బాధ్యతలు నిర్వహించనున్నారు.
యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంక్షేమాన్ని అందించే దిశగా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. గత రెండు దశాబ్దాలుగా ఇండియానా సహా పలు రాష్ట్రాలోని ప్రైవేట్ ఆరోగ్య రంగ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు.