ఫసల్ బీమా గడువు పెంపు
హన్మకొండ : ప్రధానమంత్రి ఫసల్ బీమా గడువును ఈ నెల 10 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటి వరకు ఈ పథకం లో చేరని రైతులు 10లోపు బీమా చేయిం చుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా సం యుక్త సంచాలకురాలు ఉషాదయాళ్ తెలి పారు. ఖరీఫ్‌లో సాగుచేసే పంటలు ప్రకృ తి వైఫరీత్యాలతో నష్టపోతే బీమా చేయిం చుకున్న రైతులకు పరిహారం అందుతుం దని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, పసుపు పంటలకు బీమా వర్తిస్తుందని తెలిపారు. పంటరుణాలు తీసుకున్న రైతులకు సంబంధిత బ్యాంకులు ప్రీమియం చెల్లిస్తాయని, రుణం పొందని రైతులు బ్యాంకుల్లో కాని, వ్యవసాయ అధికారిని కలిసి ప్రీమియం చెల్లించవచ్చని తెలిపా రు. బజాజ్ అలియాంజ్ కంపెనీ బీమా అమలు చేస్తుందని తెలిపారు. వివరాలకు 7893802110(ఆనంద్), 9133683399 (శ్రీనివాస్), 8886221685 (పశాంత్) సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. వరి ఎకరాకు ప్రీమియం రూ.560, మొక్కజొన్నకు రూ.400, జొన్నకు రూ.100, కం దికి రూ.260, పెసరకు రూ.200, వేరుశనగకు రూ.320, పసుపు ఎకరాకు రూ.1100 చొప్పున ప్రీమియం చెల్లించాలని కోరారు.