breaking news
usl chairman
-
యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్‌గా నేనే ఉంటా..
వాటాదారులు మాత్రమే నన్ను తొలగించగలరు... కంపెనీ బోర్డుకు మాల్యా స్పష్టీకరణ న్యూఢిల్లీ: యునెటైట్ స్పిరిట్స్(యూఎస్ఎల్) చైర్మన్ పదవిలోనే కొనసాగుతానని.. బోర్డు నుంచి తనను కంపెనీ షేర్హోల్డర్లు మాత్రమే తొలగించగలరని విజయ్ మాల్యా స్పష్టం చేశారు.కంపెనీ నిధులను మాల్యా అక్రమంగా ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించారని, అకౌంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. బోర్డు నుంచి తప్పుకోవాల్సిందిగా శనివారంనాటి బోర్డు సమావేశంలో డియాజియో సంస్థ సూచించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తప్పుకోకపోతే ఈ అంశాన్ని షేర్‌హోల్డర్ల ముందు పెడతామని కూడా పేర్కొంది. అయితే, అవకతవకలకు సంబంధించి కంపెనీ డెరైక్టర్ల బోర్డు చేసిన ఆరోపణలను మాల్యా తోసిపుచ్చారు. ప్రపంచ లిక్కర్ దిగ్గజం డియాజియో.. యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతో నియంత్రణ అంతా ప్రస్తుతం ఆ కంపెనీ చేతుల్లోనే ఉంది. అయితే, బోర్డులో డెరైక్టర్ పదవితోపాటు చైర్మన్‌గా తాను కొనసాగే విషయంలో డియాజియోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని.. అందువల్ల వైదొలగే ప్రసక్తేలేదని మాల్యా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని డియాజియో చర్చించనున్నట్లు కూడా చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,489 కోట్ల భారీ నికర నష్టాన్ని మూటగట్టుకోవడంతో.. యూబీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలు ఇతరత్రా అంశాలపై యునెటైడ్ స్పిరిట్స్ విచారణకు ఆదేశించింది.సెబీ కన్ను...: డియాజియో తాజా ఆరోపణల నేపథ్యంలో యూఎస్ఎల్ అకౌంట్లలో అవకతవకలు, నిధుల మళ్లింపు, ఇతరత్రా అంశాలను నిగ్గుతేల్చేందుకు సెబీతో పాటు ఇతర ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగనున్నాయి. యూఎస్ఎల్, ఇతర యూబీ గ్రూప్ కంపెనీల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై దృష్టిపెట్టినట్లు సెబీ వర్గాలు చెప్పాయి. -
మాల్యా.. ఇక తప్పుకోండి..
- యూఎస్ఎల్ చైర్మన్‌గా వైదొలగాలని డయాజియో సూచన - తిరస్కరించిన మాల్యా న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలకు నిధుల మళ్లించారన్న ఆరోపణపై యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్ఎల్) చైర్మన్, డెరైక్టర్ హోదాల నుంచి తప్పుకోవాలంటూ విజయ్ మాల్యాకు డయాజియో సంస్థ సూచించింది. దీనికి మాల్యా అంగీకరించని పక్షంలో ఆయన్ను తొలగించే అంశాన్ని షేర్హోల్డర్లకు ముందు ఉంచనున్నట్లూ స్పష్టం చేసింది. శనివారం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ డిమాండ్‌ను మాల్యా తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. మాల్యా సారథ్యంలోని యూబీ గ్రూప్ నుంచి యూఎస్‌ఎల్‌లో బ్రిటన్ కంపెనీ డయాజియో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో యూఎస్ఎల్ భారీగా రూ. 4,489 కోట్ల మేర నష్టాలను ప్రకటించడంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులపై డయాజియో విచారణ జరిపింది. ఈ నివేదిక ప్రకారం 2010-2013 మధ్య కాలంలో యూఎస్ఎల్ నుంచి వివిధ యూబీ గ్రూప్ కంపెనీలకు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ యిర్లైన్స్కు ఇచ్చినట్లుగా చూపిన రుణాల లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది.