కలిగిరి వెంకన్నకు ఊంజల్ సేవ
కలిగిరికొండ(పెనుమూరు):
పర్యాటక కేంద్రమైన కలిగిరికొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామికి పెరటాసి నెల ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం ఊంజల్‌సేవ ఘనంగా జరిగింది. ఉదయం ఆలయ చైర్మన్ ఈశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు ఆర్ వాసుదేవాచార్యులు స్వామికి నిత్య కైంకర్య పూజలు చేశారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ విగ్రహాలకు పాలు, తేనె, నెయ్యితో అభిషేకించారు. ఉభయ దారులు తీసుకొచ్చిన పూలతో స్వామిని అందంగా అలంకరించి భస్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం స్వామిని పల్లకిపై ప్రతిష్టించి మేళతాళాల మధ్య ఆలయ ప్రాంగణంలో వైభవం ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు బాణ సంచా పేల్చుతూ స్వామి ఉత్సవం పూర్తి చేశారు. ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు మధ్యాహ్నం ఉభయదారులు అన్నదానం చేశారు. ఈ ఉత్సవాలకు పూతలపుట్టు మండలం బత్తలవారిపల్లెకు చెందిన పద్మనాభరెడ్డి, మురహరిరెడ్డి, మునికృష్ణారెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, బాబురెడ్డి, గోపి కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.