ఉగ్రవాది సైఫుల్లా హతం
ఐసిస్లోని ఖురాసన్ మాడ్యుల్లో సైఫుల్లా క్రియాశీల వ్యక్తి: ఏటీఎస్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులోని ఓ ఇంట్లో దాక్కున్న అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు 12 గంటలపాటు సాగిన ఆపరేషన్ ముగిసింది. ఎదురుకాల్పుల్లో అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా మరణించి నట్లు పోలీసులు తెలిపారు. ‘తొలుత ఒకరి కంటే ఎక్కవ మంది ఉగ్రవాదులు ఇంట్లో నక్కినట్లు అనుమానించాం. ఇంట్లోకి ప్రవే శించిన బలగాలు.. అక్కడ ఆయుధాలతో పాటు పడిఉన్న ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించాయి.
ప్రస్తుతానికి ఆపరేషన్ ముగిసినట్లే’ అని యూపీ అదనపు డీజీపీ దల్జీత్ చౌదరి బుధవారం తెలిపారు. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) ఐజీ అసీమ్ అరుణ్ మాట్లాడుతూ, ఈ ఉగ్రవాది ఐసిస్లోని ఖురాసన్ మాడ్యు ల్లో క్రియాశీల వ్యక్తి అని చెప్పారు. మంగళ వారం భోపాల్–ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో జరిగిన పేలుడుతో ఇతడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశద్రోహి నా కొడుకు కాలేడు..
‘ఓ దేశద్రోహి నా కొడుకు కాలేడు’ అని అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా తండ్రి సర్తాజ్ అన్నారు. సైఫుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించిన సర్తాజ్.. ‘ఓ దేశద్రోహితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని పేర్కొన్నారు.