uttar pradesh chief minister yogi adityanath
-
Ayodhya Ram Mandir: కొనసాగుతున్న భక్తుల వరద
అయోధ్య/లఖ్‌నవూ: అయోధ్యకు భక్తుల వరద కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మధ్యాహ్న సమయానికే దాదాపు 3 లక్షల మంది బాలక్ రామ్ దర్శనం చేసుకున్నట్టు శ్రీరామ జన్మభూమి ట్రస్టు వర్గాలు తెలిపాయి. మంగళవారం తొలి రోజు 5 లక్షల మందికి పైగా దర్శనాలు చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా క్యూ లైన్లలో భారీగా బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వారికి తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. మరోవైపు, అయోధ్యకు దారితీసే హైవేలు, ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో భక్తుల ప్రవాహం మరింత పెరిగేలా ఉండటంతో ఉత్తరప్రదేశ్ సర్కారు రంగంలోకి దిగింది. భక్తుల సంఖ్యను నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. వాటిలో భాగంగా అయోధ్యకు యూపీ రోడ్డు రవాణా సంస్థ బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేసింది. నగరానికి ప్రైవేటు బస్సుల రాకపోకలపైనా నిషేధం విధించారు. వీఐపీలు అయోధ్య సందర్శనను వీలైనంత కాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మంత్రులూ, ఫిబ్రవరిలో వెళ్లొద్దు: మోదీ భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో అయోధ్య సందర్శన యోచన మానుకోవాల్సిందిగా కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ కోరినట్టు సమాచారం. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ఇందుకు వేదికైంది. ఇప్పటికిప్పుడు వారు అయోధ్యలో పర్యటిస్తే ప్రొటోకాల్స్ తదితరాలతో భారీగా వస్తున్న సాధారణ భక్తులకు ఇబ్బందికరంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ మందిర ప్రారంభం, రామ్ లల్లా ప్రాణప్రతిష్టపై భక్తుల ఫీడ్‌బ్యాక్ గురించి మంత్రులను అడిగి తెలుసుకున్నారు. గర్భాలయంలోకి వానరం హనుమ ఆశీర్వాదమే: ట్రస్టు అయోధ్య రామాలయంలో ఆసక్తికర సన్నవేశం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వేళ ఓ వానరం దక్షిణ ద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశించింది. లోపల కలియదిరిగింది. రామల్ లల్లా ఉత్సవ విగ్రహం చెంతకు వెళ్లింది. విగ్రహాన్ని పడేస్తుందేమోనని లోనికొచ్చిన భద్రతా సిబ్బందిని చూస్తూ నింపాదిగా తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్లింది. బారులు తీరిన భక్తుల కేసి చూస్తూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను క్షేత్ర ట్రస్టు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆ వానరం తీరు అచ్చం మనిíÙనే తలపించిందని భద్రతా సిబ్బంది గుర్తు చేసుకున్నారు. బహుశా హనుమంతుడే బాలక్ రామ్ దర్శనార్థం వచ్చినట్టుందని వారు అభిప్రాయపడ్డారు. అయోధ్యలో హెలికాప్టర్ దర్శనాలు సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య సందర్శనార్థం యూపీలో పలు నగరాల నుంచి హెలికాప్టర్ సరీ్వసులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరఖ్‌పూర్, వారణాసి, లక్నో, మధుర, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ నుంచి ఈ సేవలుంటాయి. ఆయా నగరాల నుంచి వచ్చే హెలికాప్టర్ల ల్యాండింగ్ కోసం అయోధ్యలో సరయూ నదీ తీరంలో నూతన హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. అయోధ్య, హనుమాన్ గఢి, సరయూ నదీ ప్రాంతాల విహంగ వీక్షణంకు అవకాశం కలి్పస్తున్నారు. ఈ ఏరియల్ టూర్‌కు ఒక్కొక్కరికి రూ.3,539 వసూలు చేస్తారు. ఏరియల్ టూర్ ఒకేసారి ఐదుగురు చూడొచ్చు. -
సీఎంల విషయంలో బీజేపీది అదే సంప్రదాయం
ముఖ్యమంత్రిగా రాజ్‌పూత్(రాజపుత్ర) యోగీ ఆదిత్యనాథ్‌ను ఎంపికచేయడం ద్వారా 1991 నుంచీ ఉత్తర్‌ప్రదేశ్ సీఎంల విషయంలో తాను అనుసరిస్తున్న సంప్రదాయాన్నే(బ్రాహ్మణేతర నేతలకు సీఎం పదవి) బీజేపీ కొనసాగించినట్టయింది. మొదటి సీఎం కల్యాణ్‌సింగ్ బీసీ వర్గమైన లోధా కుటుంబంలో జన్మించగా, తర్వాత వచ్చిన కాషాయ ముఖ్యమంత్రులు రాంప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్(ఠాకూర్ లేదా రాజ్‌పూత్) ఇద్దరూ అగ్రవర్ణాలవారే. అయితే, బ్రాహ్మణాధిపత్యం ఎక్కువనే ప్రచారం ఉన్న బీజేపీ హిందూ అగ్రవర్ణాల్లో అధిక జనాభా, రాజకీయాధిపత్యం ఉన్న బ్రాహ్మణులకు ఇంత వరకు ఇక్కడ సీఎం పదవి ఇవ్వకపోవడం విశేషమే. 1946 నుంచీ కాంగ్రెస్ తరఫున పది మంది నేతలు యూపీ ముఖ్యమంత్రి పదవి చేపడితే, వారిలో ఆరుగురు (పండిత గోవిందవల్లభ్ పంత్, సుచేతా కృపలాణీ, కమలాపతి త్రిపాఠీ, హెచ్ఎన్ బహుగుణ, ఎన్డీ తివారీ, శ్రీపతి మిశ్రా) బ్రాహ్మణులే. 21 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ పాలన తర్వాత 1967లో వ్యవసాయ కులానికి చెందిన ముఖ్యమంత్రిగా మాజీ కాంగ్రెస్ నేత, బీకేడీ స్థాపకుడు చౌధరీ చరణ్‌సింగ్(జాట్) సీఎం అయ్యారు. కాంగ్రెస్ పాలనలో బ్రాహ్మణ, కాయస్థ, వైశ్య వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రులయ్యారు. బ్రాహ్మణుల తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బీసీ వర్గం యాదవ కుటుంబంలో జన్మించిన నేత(రాంనరేశ్‌యాదవ్) మొదటిసారి సీఎంగా ప్రమాణం చేసింది 1977 జనతాపార్టీ హయాంలోనే. కాంగ్రెస్ పాలనలో క్షత్రియవర్గానికి(ఠాకూర్ లేదా రాజపూత్) చెందిన ఇద్దరు నేతలు విశ్వనాథ్‌ప్రతాప్(వీపీ) సింగ్ (1980లో), వీర్బహాదూర్సింగ్(1985లో) సీఎంలయ్యారు. ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఈయనే 1970–71 మధ్య దాదాపు ఆరు నెలలు కాంగ్రెసేతర సంకీర్ణ సర్కారును నడిపిన సీఎం త్రిభువన్ నారాయణ్(టీఎన్) సింగ్ కూడా రాజపూత్ వర్గానికి చెందిన నేత. మరో విశేషమేమంటే, ఇంతకు ముందు బీజేపీ చివరి సీఎం రాజ్‌నాథ్‌సింగ్ 2002లో పదవి నుంచి వైదొలిగారు. ఆయన తర్వాత బీజేపీ సీఎం పదవి కైవసం చేసుకోవడానికి 15 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ తర్వాత కాషాయపక్షం తరఫున ఆయన సామాజికవర్గానికి చెందిన ఆదిత్యనాథ్‌ను ఎంపికచేశారు. బీజేపీ అవిభక్త యూపీలో మొదటిసారి సాధారణ మెజారిటీ(425కు గానూ 221 సీట్లు) సాధించినప్పుడు బీసీ వర్గానికి చెందిన కల్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మళ్లీ పాతికేళ్లు గడిచాక( నాలుగింట మూడొంతులు) మెజారిటీ సాధించాక ప్రస్తుత ఉత్తరాఖండ్ ప్రాంతంలోని రాజ్‌పూత్ కుటుంబంలో పుట్టిన ఆదిత్యనాథ్‌కు బీజేపీ సీఎం పదవి కట్టబెట్టింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్