breaking news
uttaradikari
-
కడప చేరుకున్న స్వాత్మానందేంద్ర స్వామీజీ
సాక్షి, వైఎస్సార్: హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామీజీ శనివారం కడప జిల్లాకు చేరుకున్నారు. కడప అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించుకున్న అనంతరం శ్రీశ్రీ స్వత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ... హిందూ ధర్మ ప్రచారయాత్రా పేరుతో చేపట్టిన దేశవ్యాప్త యాత్రలో ఇప్పటికే 200 పైచిలుకు ఆలయాలను సందర్శించానని తెలిపారు. మొదటి విడత యాత్రలో భాగంగా చేపట్టిన 11 వేల కిలోమీటర్లు యాత్ర జనవరి 9న కృష్ణా జిల్లాలో పూర్తవుతుందని తెలిపారు. దక్షిణ భారత్ తరువాత ఉత్తర భారత్ యాత్ర చేపడతానని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా తనకు భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. స్వాత్మానందేంద్ర స్వామీజీ మొదటి విడత యాత్రలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, పల్లెలను సందర్శించనున్నారు. -
ఆత్మ ప్రదక్షిణం శ్రేయోదాయకం
విజయవాడ కల్చరల్: ఆత్మప్రదిక్షిణం శ్రేయోదాయకమని కంచిపీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో విడిది చేశారు. మంగళవారం భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేస్తూ ప్రతి వ్యక్తి ఆత్మను తెలుసుకోవాలని అన్నారు. స్వరవేదాలు ఆత్మను గురించి వివరించాయని ఆత్మను తెలుసుకుంటే వేదాలను అధ్యయనం చేసినట్లేనన్నారు. దేవాలయాల రూపురేఖలు మారుతున్నాయని, అక్కడి స్థలపురాణాలు, శాశనాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నీ నదులలోని కృష్ణతీర వాసం శ్రేష్టమైనదని పురాణాలు చెపుతున్నాయని వాటి సంసం్కృతీ సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని వివరించారు. రచయిత కవి పండితులు కె.రామకృష్ణ రచించిన నిత్యోత్సవం పూజా గ్రంథాన్ని విజయేంద్ర సరస్వతి, యల్లాప్రగడ మల్లికార్జునరావు రచించిన కృష్ణనదీ పుష్కరవైభవం పుస్తకాన్ని వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకమండలి చైర్మన్ మాగంటి సుబ్రహ్మమణ్యం ఆవిష్కరించారు. ఉదయం నిర్వహించిన పూజాదికాలలో కావేరీ పూజలు, 18 రకాల నివేదనలు మహాత్రిపురసుందరీ సమేత చంద్రమౌళ్వీశ్వరస్వామి సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా చిట్టా కార్తీక్ వీణా వాదనతో అలరించారు. ఈనెల 17 ఉదయం వేద సభ నిర్వహిస్తామని, అనంతరం పండిత సత్కారం ఉంటుందని వివరించారు. బుధవారం కృష్ణవైభవం పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని పీఠం మేనేజర్ సుందరేశ అయ్యర్ తెలిపారు.