ఆత్మ ప్రదక్షిణం శ్రేయోదాయకం | kanchi peta uttaradikarai visits vijayawada | Sakshi
Sakshi News home page

ఆత్మ ప్రదక్షిణం శ్రేయోదాయకం

Published Wed, Aug 3 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

ఆత్మ ప్రదక్షిణం శ్రేయోదాయకం

ఆత్మ ప్రదక్షిణం శ్రేయోదాయకం

విజయవాడ కల్చరల్‌:

ఆత్మప్రదిక్షిణం శ్రేయోదాయకమని కంచిపీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో విడిది చేశారు. మంగళవారం భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేస్తూ ప్రతి వ్యక్తి ఆత్మను తెలుసుకోవాలని అన్నారు. స్వరవేదాలు ఆత్మను గురించి వివరించాయని ఆత్మను తెలుసుకుంటే వేదాలను అధ్యయనం చేసినట్లేనన్నారు. దేవాలయాల రూపురేఖలు మారుతున్నాయని, అక్కడి స్థలపురాణాలు, శాశనాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నీ నదులలోని కృష్ణతీర వాసం శ్రేష్టమైనదని పురాణాలు చెపుతున్నాయని వాటి సంసం్కృతీ సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని వివరించారు. రచయిత  కవి పండితులు కె.రామకృష్ణ రచించిన నిత్యోత్సవం పూజా గ్రంథాన్ని విజయేంద్ర సరస్వతి, యల్లాప్రగడ మల్లికార్జునరావు రచించిన కృష్ణనదీ పుష్కరవైభవం పుస్తకాన్ని వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకమండలి చైర్మన్‌ మాగంటి సుబ్రహ్మమణ్యం ఆవిష్కరించారు. ఉదయం నిర్వహించిన పూజాదికాలలో కావేరీ పూజలు, 18 రకాల నివేదనలు మహాత్రిపురసుందరీ సమేత చంద్రమౌళ్వీశ్వరస్వామి సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా చిట్టా కార్తీక్‌ వీణా వాదనతో అలరించారు. ఈనెల 17 ఉదయం వేద సభ నిర్వహిస్తామని, అనంతరం పండిత సత్కారం ఉంటుందని వివరించారు. బుధవారం కృష్ణవైభవం పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని  పీఠం మేనేజర్‌ సుందరేశ అయ్యర్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement