kanchi pitam
-
70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర
సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈయన అసలు పేరు శంకరనారాయణన్. 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. జయేంద్ర సరస్వతితో కలసి అడుగులు వేశారు. వివాదాల్లోనూ, కారాగారవాసంలోనూ తోడుగానే నిలబడ్డారు. మేఘాలయ వరకు పర్యటించి ఆధ్యాతిక బోధనలు చేశారు. పెడదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపు, దేశంలో సాంస్కృతిక, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, కొరవడుతున్న నైతిక, మానవీయత విలువల్ని రక్షించే రీతిలో ఆయన పయనం సాగించారు. యువకుల్లో చైతన్యం లక్ష్యంగా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పురాతన సాహిత్యాన్ని కాపాడడం, భారతీయ, విదేశీ భాషల్లో భక్తుల కోసం అనేక ప్రచురణలను తీసుకొచ్చారు. పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రం.. కాంచీపురం దక్షిణ భారతంలో ఉన్న శివ ఆరాధనలో పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రంగా కాంచీపురం అలరారుతోంది. ఈ క్షేత్రంలోని కంచి కామకోటి పీఠానికి విశిష్ట చరిత్ర ఉంది. ఆది శంకరాచార్య చేతుల మీదుగా ఆవిర్భవించిన ఈ మఠం ద్వారా హిందూ మత సేవలో రెండు దశాబ్దాలకు పైగా జయేంద్ర సరస్వతి నిమగ్నమయ్యారు. భౌగోళికంగా భూమి(కాంచీపురం), ఆకాశం(కడలూరు జిల్లా చిదంబరం), గాలి( చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి), అగ్ని(తిరువణ్ణామలై), నీరు(తిరువన్నై కోయిల్) క్షేత్రాలను పిలుస్తుంటారు. వీటన్నింటి సమ్మేళనంతో శ్రీ కంచి కామకోటి పీఠం ఆవిర్భవించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మఠానికి తల భాగంగా శంకరాచార్య వారిని అభివర్ణిస్తుంటారు. క్రీ.శ 482లో ఆది శంకర భగవత్పదచార్య స్వామి ఈ మఠాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ కామకోటి పీఠం సంప్రదాయంగా కామాక్షి అమ్మవారిని సూచిస్తుంటుంది. కామకోటి దుర్గాదేవిని సూచిస్తుంది. శ్రీ శంకర భగవత్పాడ(శ్రీశంకరాచార్య) స్వామి వారు కంచిలో స్థిరపడుతూ తన కంటూ ఓ సొంత నివాసంగా ఈ మఠాన్ని నెలకొల్పారు. ఆయన అడుగు జాడల్లో శిష్యులైన శ్రీ సురేశ్వర చార్య, సర్వజ్నాత్మాన్, సత్య భోదేంద్ర సరస్వతి, జ్ఞానందేంద్ర సరస్వతి, సుధానందేంద్ర సరస్వతి వంటి పీఠాధిపతుల నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో ఈ పీఠం ముందుకు సాగింది. ఇది వరకు ఉన్న 68 మంది పీఠాధిపతులతో పోల్చితే, జయేంద్ర సరస్వతి ఈ పీఠం పరిరక్షణకు, హిందూ ధర్మ ప్రచారంలో విశిష్ట సేవల్ని అందించారు. ఆధ్యాత్మికమే కాదు, విద్య, వైద్య, సేవాపరంగానూ ఈ మఠాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. -
పంచాంగ నిర్వహణపై సదస్సు
విజయవాడ కల్చరల్ : లబ్బీపేటలోని శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో కంచిపీఠం ఆధ్వర్యాన మంగళవారం పంచాగ సదస్సు నిర్వహించారు. శంకర విజయేంద్ర సరస్వతి నేతృత్వంలో జరిగిన ఈ పంచాంగ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల పండితులు హారయ్యారు. అందరికీ అందుబాటులో ఒకే పంచాగం అమలు కోసం తీసుకోవాల్సిన విధివిధానాల గురించి పండితులు చర్చించారు. తిధి, వారాలు గణించం, శాస్త్రసమ్మతమైన అంశాలను ప్రస్తావించడం వంటి అంశాలపై చర్చ సాగింది. బుధవారం కూడా ఈ సదస్సు నిర్వహిస్తామని పీఠం ప్రతిధిని తెలిపారు. తొలుత శ్రీమహాత్రిపురసుందరీ సమేత చంద్రమౌళ్వీశ్వర స్వామికి జయేంద్రస్వామి పూజలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 5.55 గంటలకు కంచి స్వాములు దుర్గాఘాట్‌లో కృష్ణవేణీ నదికి పూజలు నిర్వహించి, పుష్కర ప్రవేశ సమయంలో స్నానమాచరిస్తారని కంచిపీఠం మేనేజర్ సుందరేశ అయ్యర్ చెప్పారు. -
ఆత్మ ప్రదక్షిణం శ్రేయోదాయకం
విజయవాడ కల్చరల్: ఆత్మప్రదిక్షిణం శ్రేయోదాయకమని కంచిపీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో విడిది చేశారు. మంగళవారం భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేస్తూ ప్రతి వ్యక్తి ఆత్మను తెలుసుకోవాలని అన్నారు. స్వరవేదాలు ఆత్మను గురించి వివరించాయని ఆత్మను తెలుసుకుంటే వేదాలను అధ్యయనం చేసినట్లేనన్నారు. దేవాలయాల రూపురేఖలు మారుతున్నాయని, అక్కడి స్థలపురాణాలు, శాశనాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నీ నదులలోని కృష్ణతీర వాసం శ్రేష్టమైనదని పురాణాలు చెపుతున్నాయని వాటి సంసం్కృతీ సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని వివరించారు. రచయిత కవి పండితులు కె.రామకృష్ణ రచించిన నిత్యోత్సవం పూజా గ్రంథాన్ని విజయేంద్ర సరస్వతి, యల్లాప్రగడ మల్లికార్జునరావు రచించిన కృష్ణనదీ పుష్కరవైభవం పుస్తకాన్ని వెంకటేశ్వరస్వామి దేవాలయ పాలకమండలి చైర్మన్ మాగంటి సుబ్రహ్మమణ్యం ఆవిష్కరించారు. ఉదయం నిర్వహించిన పూజాదికాలలో కావేరీ పూజలు, 18 రకాల నివేదనలు మహాత్రిపురసుందరీ సమేత చంద్రమౌళ్వీశ్వరస్వామి సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా చిట్టా కార్తీక్ వీణా వాదనతో అలరించారు. ఈనెల 17 ఉదయం వేద సభ నిర్వహిస్తామని, అనంతరం పండిత సత్కారం ఉంటుందని వివరించారు. బుధవారం కృష్ణవైభవం పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని పీఠం మేనేజర్ సుందరేశ అయ్యర్ తెలిపారు.