పంచాంగ నిర్వహణపై సదస్సు
Published Tue, Aug 9 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
విజయవాడ కల్చరల్ :
లబ్బీపేటలోని శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో కంచిపీఠం ఆధ్వర్యాన మంగళవారం పంచాగ సదస్సు నిర్వహించారు. శంకర విజయేంద్ర సరస్వతి నేతృత్వంలో జరిగిన ఈ పంచాంగ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల పండితులు హారయ్యారు. అందరికీ అందుబాటులో ఒకే పంచాగం అమలు కోసం తీసుకోవాల్సిన విధివిధానాల గురించి పండితులు చర్చించారు. తిధి, వారాలు గణించం, శాస్త్రసమ్మతమైన అంశాలను ప్రస్తావించడం వంటి అంశాలపై చర్చ సాగింది. బుధవారం కూడా ఈ సదస్సు నిర్వహిస్తామని పీఠం ప్రతిధిని తెలిపారు. తొలుత శ్రీమహాత్రిపురసుందరీ సమేత చంద్రమౌళ్వీశ్వర స్వామికి జయేంద్రస్వామి పూజలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 5.55 గంటలకు కంచి స్వాములు దుర్గాఘాట్‌లో కృష్ణవేణీ నదికి పూజలు నిర్వహించి, పుష్కర ప్రవేశ సమయంలో స్నానమాచరిస్తారని కంచిపీఠం మేనేజర్ సుందరేశ అయ్యర్ చెప్పారు.
Advertisement