నీల్సన్ సర్వే నిజమవుతుంది
ఉత్తరావల్లి (మెరకముడిదాం),న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలపై నీల్సన్ చేపట్టిన సర్వే నిజమవుతుంది, అత్యధిక స్థానాలను వైఎస్సా ర్ సీపీ గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ వి జయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బేబీనాయన అన్నారు. బుధవారం ఆయన ఉత్తరావల్లిలో పార్టీ ముఖ్య నాయకు లు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. ముం దుగా పార్టీ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తి కావడంతో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి బేబీనాయన, వరహాలనాయుడు పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంత రం బేబీనాయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తున్నారన్నా రు.
జిల్లాలో ఎనిమిది మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని బాబు చెబుతున్నారని, జిల్లాకు ఒకటి, రెండు ఎమ్మెల్సీలు రావడమే కష్టమైతే ఆయన అంతమందికి ఎలా పదవులు ఇవ్వగలరని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం టీడీపీలో చేరుతున్న వారంతా ముందు వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వారేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాల న్నారు. చీపురుపల్లి సమన్వయకర్త మీసాల వరహాల నాయుడు మాట్లాడుతూ మండలంలో పార్టీ బలంగా ఉందన్నా రు. ఎన్నికల్లో పార్టీ గెలుపు ఖా యమని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కరణం మురళి, శనపతి సిమ్మినాయుడు, తుమ్మగంటి సూరినాయుడు, పల్లేడ బంగారు రాజు, ఎస్. రామస్వామి, మన్నెపురి చిట్టి, సర్పంచ్ ఎం.సత్యనారాయణ, కొమ్ము శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.