కమలా బెనీవాల్ పై వేటు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీతో ఉప్పు-నిప్పులా వ్యవహరించిన కమలా బెనీవాల్ పై వేటు పడింది. మిజోరం గవర్నర్ గా ఉన్న ఆమెను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. పదవి నుంచి తొలగించారు. మరో రెండు నెలల్లో ఆమె పదవీ కాలం ముగియనుండగా ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
గుజరాత్ గవర్నర్ గా ఉన్న బేనీవాల్ నెల రోజుల క్రితమే మిజోరం గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. మణిపూర్ గవర్నర్ వీకే దుగ్గల్ కు మిజోరం గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పటించినట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా చర్యతో కమలా బేనీవాల్ శకం ముగిసిందని భావిస్తున్నారు.