ఎల్ఐసీ చీఫ్‌గా వి.కె.శర్మ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చైర్మన్‌గా వి.కె.శర్మ నియమితులయ్యారు. ఈయన ఎల్ఐసీ చీఫ్‌గా ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు. ఈయన ప్రస్తుతం ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా వ్యవహరిస్తునే సంస్థ తాత్కాలిక చైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఐసీ చైర్మన్ పదవి నుంచి ఎస్.కె.రాయ్ జూన్‌లో హఠాత్తుగా వైదొలిగిన విషయం తెలిసిందే. శర్మ 2013 నవంబర్ నుంచి ఎల్ఐసీ ఎండీగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.