vaadapalli
-
నల్లగొండ సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కార్లు, ద్విచక్రవాహనాల పై వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గురువారం నల్లగొండ జిల్లాలో ఏపీతో సరిహద్దులు ఉన్న రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌వాసులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. ఒకేసారి వేల సం ఖ్యలో ప్రజలు రావడంతో దామచర్ల మండలం వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టు, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల వద్ద ఏపీ పోలీసులు వారిని కొద్దిసేపు అడ్డుకుని అనంతరం షరతులతో రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన దామరచర్ల మండలం వాడపల్లి వంతెన వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామునుంచే ద్విచక్రవాహనాలు, కార్లల్లో ఏపీకి వెళ్లేందుకు జనం వచ్చారు. చెక్‌పోస్టు వద్ద నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) చూసిన అనంతరం తెలంగాణ పోలీసులు వారు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణానది ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వీరిని కొద్దిసేపు అడ్డుకున్నారు. సమస్య తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలసి వాడపల్లి చెక్ పోస్టును సందర్శించారు. పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడంతో ప్రజలు వచ్చేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారని, ఇకపై సరిహద్దును మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకపై ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. క్వారంటైన్‌కు వెళతామంటేనే అనుమతి ఏపీకి సరిహద్దుగా ఉన్న నాగార్జునసాగర్‌పై వంతెన దాటగానే గుంటూరు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లు, మెస్సులు మూతపడడంతో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) తీసుకుని బుధవారం రాత్రే ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు చొప్పున బయలుదేరి తెల్లారే సరికల్లా నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. మరికొంతమంది అద్దెకార్లు, టాటా సుమోల్లో ఆంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకున్నారు. అయితే నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వారి వాహనాలను మొదట నిలిపివేశారు. దీనిపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుంటూరు జిల్లా ఎస్పీ విజయారావు సరిహద్దుకు చేరుకుని 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళతామంటే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే, ఈ షరతు నచ్చని చాలామంది తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మరికొంత మంది దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు నుంచి ఏపీలోకి వెళ్లొచ్చని వాడపల్లికి వచ్చారు. -
వాడపల్లి తీర్థాన్ని విజయవంతం చేయాలి
- వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలపై సమీక్షలో జేసీ వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. వాడపల్లి తీర్థం ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు అధ్యక్షతన వెంకన్న సన్నిధిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన, అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాదిగా భక్తులు తరలిరానున్న దృష్ట్యా వివిధ శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉత్సవాలు కావడంతో ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఏడాది స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్న దృష్ట్యా విద్యుత్ తీగలు తగలకుండా, రహదారులు కుంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత ఇంజినీర్లతో సమీక్షించారు. రహదార్లకు ఎటువంటి ఇబ్బందీ లేదని వారు తెలిపారు. రథానికి విద్యుత్ తీగలు తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఏడీఈ డేవిడ్ తెలిపారు. 30 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నామని డీఎల్పీఓ జెవీవీవీఎస్ శర్మ చెప్పారు. 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నామని, వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని వైద్యాధికారులు శ్రీనివాసవర్మ, ఝున్సీ వివరించారు. అమలాపురం డీఎస్పీ అంకయ్య పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు తెలిపారు. జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో చలువ పందిళ్లు వేయాలని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తుల దాహార్తి తీర్చాలని సూచించారు. ఈ నెలాఖరుకు అన్ని పనులూ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కళ్యాణోత్సవాల పోస్టర్లను, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి బీహెచ్‌వీ రమణమూర్తి సమావేశంలో వివరించారు. అనంతరం జేసీ, ఆర్డీఓలు స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత వారికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహరావు జేసీ, ఆర్డీఓలకు స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్రిపోతు విమల, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, తహసీల్దార్ వరదా సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ప్రసాద్, ఈఓ పీఆర్డీ డీవై నారాయణ, జేఈలు రంగనాయకులు, మణికుమార్, వీరభద్రరాజు, కృష్ణమూర్తి, అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
గౌతమీ తీరాన ఘనమైన క్షేత్రం
నాటి నౌకాపురే నేటి వాడపల్లి ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతి రేపటి నుంచి 16 వరకూ బ్రహ్మోత్సవాలు వాడపల్లి (ఆత్రేయపురం): తూర్పు గోదావరి జిల్లాలో ఆధ్యాత్మికతకు ఆటపట్టులైన తావులెన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కిన వాడపల్లి. గౌతమీ గోదావరి తీరంలోVýæల ఈ క్షేత్రంలో శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 16 వరకూ వైభవంగా జరగనున్నాయి. ఆ సందర్భంగానే కాక అనునిత్యం భక్తులను సూదంటురాయిలా ఆకర్షించే ఈ క్షేత్రానికి విలక్షణ చరిత్ర ఉంది. స్వయంభువుగా వెలసిన రక్తచందనమూర్తి పురాణేతిహాసాల ప్రకారం వాడపల్లి గ్రామాన్ని దండకారణ్యంగా పిలిచేవారు. ఇక్కడ స్వామి స్వయంభువై రక్తచందనంతో శ్రీ వేంకటేశ్వరస్వామిగా మూర్తీభవించాడు. ఈ ప్రాంతాన్ని పాలించే రాజు గోదావరిలో ఒడ్డుకు చేరిన స్వయంభూ రక్త చందన విగ్రహాన్ని గుర్తించాడు. శంఖ, చక్రాలు, గద, కంఠంలో వనమాల, నుదుట ఊర్ధ్వపుండ్రాలతో, పద్మాలవంటి కన్నులతో ఉన్న స్వామి దివ్య మంగళ విగ్రహానికి అక్కడే ఘనంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. దేవర్షి నారదుడు కూడా ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నట్టు పురాణ గాథ. కాగా కలియుగంలో రుషులు అనేక పవిత్ర క్షేత్రాలను సందర్శించుకుంటూ ఓడపల్లి వచ్చి, ఇసుకలో కూరుకు పోయిన శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం ఏటి ఒడ్డున ప్రతిషి్ఠంచారు. అప్పటి నుంచి పూజలందుకుంటున్న కోనేటి రాయుడినే తాళ్లరేవు మండలం సీతారామపురానికి చెందిన పినపోతు గజేంద్రుడు అనే ఓడల వ్యాపారి 1759లో పునః ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెపుతోంది. సుమారు 400 ఏళ్ల క్రితం గౌతమీ తీరాన వున్న ఓడపల్లి (వాడపల్లి) ‘నౌకాపురి’గా ప్రసిద్ధి చెందింది. ఆ రోజుల్లో యానాం నుంచి రాజమండ్రి వరకు గౌతమీ పాయ ద్వారానే చిన్న ఓడలతో వ్యాపారులు సరుకు రవాణా చేసేవారు. ఓడలు ఆగేందుకు వీలైన ప్రాంతం కావడంతో గ్రామాన్ని నౌకాపురిగా పిలిచే వారు. 1759లో గజేంద్రుడు ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిషి్ఠంచినట్లు అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధన సంస్థ రచనల ఆధారంగా తెలుస్తోంది. గజేంద్రుడు తాళ్లరేవు నుంచి రాజమండ్రి వరకు ఉన్న పాయ ద్వారా (ప్రస్తుతం గౌతమీ గోదావరి) తనకు ఉన్న చిన్న ఓడల ద్వారా సరుకు రవాణా చేసి లాభాలను ఆర్జించేవారు. ఆయన ఓడలు 1750లో తుపాను బీభత్సానికి సముద్రంలో అదృశ్యమయ్యాయి. అవి తిరిగి ఒడ్డుకు చేరితే వెంకన్న కు ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాక ఓడలు తిరిగి దొరకడంతో ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంగణంలో వంట ఇల్లు నిర్మించుకుని నిర్మాణం ప్రారంభించారు. తాళ్లరేవు నుంచి కావిళ్లతో ధనం వాడపల్లికి తెప్పించుకుని వివిధ ప్రాంతాల శిల్పులను రప్పించి, ఊబలంక, వాడపల్లి, మెర్లపాలెం, లొల్ల, ఆత్రేయపురం తదితర ప్రాంతాల భక్తుల శ్రమదానం తో 2 ఎకరాల ప్రాంగణం లో ఎల్తైన గోపురంతో ఆలయాన్ని నిర్మించారు. 275 ఎకరాలు సమర్పించిన పెద్దాపురం రాజా పినపోతు గజేంద్రుడికి స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహారాజు రాజా వత్సవాయి తిమ్మ జగపతి మçహారాజు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు 1759లో దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాల భూమి సమర్పించారు. దీంతో ఆయన చిత్రపటాన్ని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కింది. ఏటా చైత్రశుద్ధ ఏకాదశినాడు వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి తీర్థం, కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పూర్వం ఆలయంలో ప్రతిషి్ఠంచిన వెంకన్న నిలువెత్తు విగ్రహం పొడవైన మీసాలతో ఉండేది. దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చిన తరువాత తిరుపతి వెంకన్నను పోలి ఉండేలా వాడపల్లి ఆలయంలో కూడా వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీర్చి దిద్ది నిత్య పూజలందిస్తున్నారు. ఇదీ బ్రహ్మోత్సవ సంరంభం.. 12న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, ఐశ్యర్యలక్ష్మీ హోమం, సాయంత్రం శేషవాహన సేవ, ప్రత్యేక పూజలు, 13న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, మహాసుదర్శన హోమం, సాయంత్రం 4 గంటలకు హంసవాహన, సింహవాహన సేవ, రాత్రి 7 గంటలకు స్వామి వారి కల్యాణం, వివిధ పూజా కార్యక్రమాలు. 14న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, వసంతోత్సవం, పుష్పయాగం, హనుమద్వాహన సేవ, సాయంత్రం 5 గంటలకు గరుడవాహన సేవ. 15న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అషో్టత్తర శత కలశాభిషేకం, సూర్యప్రభవాహన సేవ, సాయంత్రం చంద్రప్రభవాహన సేవ, సహస్ర దీపాలంకరణ సేవ 16న ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, గజవాహన సేవ, సాయంత్రం చూరో్ణత్సవం, సాయంత్రం 4 గంటలకు అశ్వవాహన సేవ తదితర కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.