గౌతమీ తీరాన ఘనమైన క్షేత్రం | vaadapalli bramostav special | Sakshi
Sakshi News home page

గౌతమీ తీరాన ఘనమైన క్షేత్రం

Published Mon, Oct 10 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

గౌతమీ తీరాన ఘనమైన క్షేత్రం

గౌతమీ తీరాన ఘనమైన క్షేత్రం

నాటి నౌకాపురే నేటి వాడపల్లి
‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతి 
రేపటి నుంచి 16 వరకూ బ్రహ్మోత్సవాలు 
వాడపల్లి (ఆత్రేయపురం): తూర్పు గోదావరి జిల్లాలో ఆధ్యాత్మికతకు ఆటపట్టులైన తావులెన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కిన వాడపల్లి. గౌతమీ గోదావరి తీరంలోVýæల ఈ క్షేత్రంలో శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 16 వరకూ వైభవంగా జరగనున్నాయి. ఆ సందర్భంగానే కాక అనునిత్యం భక్తులను సూదంటురాయిలా ఆకర్షించే ఈ క్షేత్రానికి విలక్షణ చరిత్ర ఉంది.
స్వయంభువుగా వెలసిన రక్తచందనమూర్తి
పురాణేతిహాసాల ప్రకారం వాడపల్లి గ్రామాన్ని దండకారణ్యంగా పిలిచేవారు. ఇక్కడ స్వామి స్వయంభువై రక్తచందనంతో శ్రీ వేంకటేశ్వరస్వామిగా మూర్తీభవించాడు. ఈ ప్రాంతాన్ని పాలించే రాజు గోదావరిలో ఒడ్డుకు చేరిన స్వయంభూ రక్త చందన విగ్రహాన్ని గుర్తించాడు. శంఖ, చక్రాలు, గద, కంఠంలో వనమాల, నుదుట ఊర్ధ్వపుండ్రాలతో, పద్మాలవంటి కన్నులతో ఉన్న  స్వామి దివ్య మంగళ విగ్రహానికి అక్కడే ఘనంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. దేవర్షి నారదుడు కూడా ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నట్టు పురాణ  గాథ. కాగా కలియుగంలో రుషులు అనేక పవిత్ర క్షేత్రాలను సందర్శించుకుంటూ ఓడపల్లి వచ్చి, ఇసుకలో కూరుకు పోయిన శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం ఏటి ఒడ్డున ప్రతిషి్ఠంచారు. అప్పటి నుంచి పూజలందుకుంటున్న కోనేటి రాయుడినే తాళ్లరేవు మండలం సీతారామపురానికి చెందిన పినపోతు గజేంద్రుడు అనే ఓడల వ్యాపారి 1759లో పునః ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెపుతోంది.
సుమారు 400 ఏళ్ల క్రితం గౌతమీ తీరాన వున్న ఓడపల్లి (వాడపల్లి) ‘నౌకాపురి’గా ప్రసిద్ధి చెందింది. ఆ రోజుల్లో యానాం నుంచి రాజమండ్రి వరకు గౌతమీ పాయ ద్వారానే చిన్న ఓడలతో వ్యాపారులు సరుకు రవాణా చేసేవారు. ఓడలు ఆగేందుకు వీలైన ప్రాంతం కావడంతో గ్రామాన్ని నౌకాపురిగా పిలిచే వారు. 1759లో గజేంద్రుడు ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిషి్ఠంచినట్లు అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధన సంస్థ రచనల ఆధారంగా తెలుస్తోంది. గజేంద్రుడు తాళ్లరేవు నుంచి రాజమండ్రి వరకు ఉన్న పాయ ద్వారా (ప్రస్తుతం గౌతమీ గోదావరి) తనకు ఉన్న చిన్న ఓడల ద్వారా సరుకు రవాణా చేసి లాభాలను ఆర్జించేవారు. ఆయన ఓడలు 1750లో తుపాను బీభత్సానికి సముద్రంలో  అదృశ్యమయ్యాయి. అవి తిరిగి ఒడ్డుకు చేరితే వెంకన్న కు ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాక ఓడలు తిరిగి దొరకడంతో ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంగణంలో వంట ఇల్లు నిర్మించుకుని నిర్మాణం ప్రారంభించారు. తాళ్లరేవు నుంచి కావిళ్లతో ధనం వాడపల్లికి తెప్పించుకుని వివిధ ప్రాంతాల శిల్పులను  రప్పించి, ఊబలంక, వాడపల్లి, మెర్లపాలెం, లొల్ల, ఆత్రేయపురం తదితర ప్రాంతాల భక్తుల శ్రమదానం తో 2 ఎకరాల ప్రాంగణం లో ఎల్తైన గోపురంతో ఆలయాన్ని నిర్మించారు.
275 ఎకరాలు సమర్పించిన పెద్దాపురం రాజా
పినపోతు గజేంద్రుడికి స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహారాజు  రాజా వత్సవాయి తిమ్మ జగపతి మçహారాజు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు 1759లో దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాల భూమి సమర్పించారు.  దీంతో ఆయన చిత్రపటాన్ని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కింది. ఏటా చైత్రశుద్ధ ఏకాదశినాడు వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి తీర్థం, కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పూర్వం ఆలయంలో ప్రతిషి్ఠంచిన వెంకన్న నిలువెత్తు విగ్రహం పొడవైన మీసాలతో ఉండేది. దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చిన తరువాత తిరుపతి వెంకన్నను పోలి ఉండేలా వాడపల్లి ఆలయంలో కూడా వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీర్చి దిద్ది నిత్య పూజలందిస్తున్నారు.
ఇదీ బ్రహ్మోత్సవ సంరంభం..
12న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, ఐశ్యర్యలక్ష్మీ హోమం, సాయంత్రం శేషవాహన సేవ, ప్రత్యేక పూజలు, 
13న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, మహాసుదర్శన హోమం, సాయంత్రం 4 గంటలకు హంసవాహన, సింహవాహన సేవ, రాత్రి 7 గంటలకు స్వామి వారి కల్యాణం, వివిధ పూజా కార్యక్రమాలు. 
14న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, వసంతోత్సవం, పుష్పయాగం, హనుమద్వాహన సేవ, సాయంత్రం 5 గంటలకు గరుడవాహన సేవ.
15న ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అషో్టత్తర శత కలశాభిషేకం, సూర్యప్రభవాహన సేవ, సాయంత్రం చంద్రప్రభవాహన సేవ, సహస్ర దీపాలంకరణ సేవ
16న ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, గజవాహన సేవ, సాయంత్రం చూరో్ణత్సవం, సాయంత్రం 4 గంటలకు అశ్వవాహన సేవ తదితర కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement