ఉద్రిక్తతకు దారితీసిన స్థల వివాదం
► పెందుర్తి సమీపంలో రెండు వర్గాల కొట్లాట
► ఇరువర్గాల్లో 28 మందిపై కేసుల నమోదు
పెందుర్తి : ఓ స్థలం పట్టా కోసం ఒక కుటుంబంలో వచ్చిన చిన్నపాటి గొడవ కొట్లాటకు దారితీసింది. చినికి చినికి గాలివానై రక్తం చిందించింది. మొత్తానికి ఓ ఫ్యాక్షన్ సినిమాలో సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన పెందుర్తి సమీపంలోని అంబేద్కర్‌నగర్ వద్ద ఉన్న ఏకలవ్యకాలనీ(పందులకాలనీ)లో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలో గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన పటా్టల విషయంలో ఓ కుటుంబంలో వివాదం నడుస్తుంది.
వాడపల్లి దసరా అనే వ్యక్తి కుటుంబానికి చెందిన కొందరు వ్యకు్తలు సదరు పటా్టల అమ్మకంపై కొన్నాళు్లగా గొడవ పడుతున్నారు. దీనిపై శుక్రవారం మరోసారి కాలనీలో బహిరంగంగా ఒకరిని ఒకరు దూషించుకున్నారు. పరిస్థితి చేదాటి కర్రలు, రాళ్లు, ఇతర ఆయుధాలతో పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ కాలనీలో బీభత్సం సృష్టించారు. వీధుల్లో పరుగులు పెడుతూ రణరంగంగా మార్చేశారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువు్వకుని, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయా్యయి. గాయపడ్డవారిలో మహిళలు కూడా ఉన్నారు.
స్థానికులకూ గాయాలు
పరస్పరం దాడులు చేసుకున్న సమయంలో కాలనీలో ఉన్న ఇతరులకు కూడా గాయాలయా్యయి. విచక్షణారహితంగా రాళ్లు, కర్రలు విసురుకోవడంతో గొడవ చూస్తున్న వారికి కూడా దెబ్బలు తగిలాయి. మరోవైపు గొడవ జరుగుతున్న సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులను సైతం ఇరువర్గాలు పట్టించుకోకుండా రాళ్లు రువు్వకున్నారు. దాదాపు గంటసేపు శ్రమించిన పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను చెదరగొట్టి పలువురిని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోగా.. 28 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని సీఐ జె.మురళి చెప్పారు.