వైష్ణవ్ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: వైష్ణవ్ రెడ్డి (101 నాటౌట్) అజేయ సెంచరీతో సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ జట్టు విజయాన్ని నమోదు చేసింది. బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ హెచ్‌సీఏ అండర్-16 నాకౌట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆండ్రూస్ జట్టు 33 పరుగుల తేడాతో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ ఆండ్రూస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్ వైష్ణవ్ రెడ్డి మెరుపులు మెరిపించాడు.
సంపత్ 29, జగదీశ్ రెడ్డి 26 పరుగులు చేశారు. శ్రీచైతన్య జట్టు బౌలర్లలో ఆశిష్, రేవంత్, సంహిత్, గౌరవ్ రెడ్డి, ఆశిష్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీ చైతన్య జట్టు 47.5 ఓవర్లలో 184 పరుగులు చేసి ఆలౌటైంది. రేవంత్ (39), గౌరవ్ (31) ఫర్వాలేద నిపించగా, ప్రతీక్ రెడ్డి 27, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి 21 పరుగులు చేశారు. ఆండ్రూస్ బౌలర్లలో రిషబ్ 3, సంకేత్ 2, వైష్ణవ్, ఆదిత్య చెరో వికెట్ పడగొట్టారు.
మరో మ్యాచ్ స్కోర్లు: సెయింట్ జోసెఫ్ స్కూల్: 230/4 (ప్రత్యూష్ 147 నాటౌట్, ఖాజా పాషా 30), కరీంనగర్: 233/5 (అజయ్ రెడ్డి 57, శ్రీకిరణ్ 71).