ఎన్టీఆర్ ఒప్పేసుకున్నాడు..!
టాలీవుడ్లో స్టార్ రైటర్స్‌గా పేరుతెచ్చుకున్న చాలా మంది రచయితలు దర్శకులుగా కూడా మంచి విజయాలు సాధించారు. అదే బాటలో మరో స్టార్ రైటర్ దర్శకుడిగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా రోజులుగా ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్న వక్కంతం వంశీకి ఫైనల్‌గా ఓకె చెప్పాడు జూనియర్. కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించిన వంశీ, త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా దర్శకుడిగా మారాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ 2 సినిమాను చేయడానికి అంగీకరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి వక్కంతం వంశీ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు.