valleys
-
ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: కొన్నిచోట్ల పచ్చదనం.. మరి కొన్నిచోట్ల దట్టమైన అడవిని తలపించేలా గుబురుగా పెరిగిన చెట్లు.. కొండలు, లోయలు. మైమరిపించే అనంతగిరి ప్రాంతం.. విదేశీ వలస పక్షుల స్వర్గధామం భిగ్వాన్ బ్యాక్‌వాటర్ ప్రాంతం.. పశ్చిమ కనుమలను ముద్దాడుతూ ముందుకు సాగే బీమా నది. దానిపై నిర్మించిన ఉజ్జయినీ డ్యాం.. ఇవన్నీ రెప్ప వాల్చనీయవు.. మరో లోకానికి తీసుకువెళతాయి. చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటే ఆ మజానే వేరు. రైలు ప్రయాణికులకు అలాంటి మధురానుభూతిని మిగిల్చేలా ఓ సరికొత్త అవకాశాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. మూడురోజుల క్రితమే ప్రారంభం ఇరువైపులా పెద్ద పెద్ద గాజు కిటికీలు, రూఫ్ భాగంలో కూడా బయటి ప్రాంతాలు కనిపించేలా ప్రత్యేకంగా అద్దాలు..ఇదే విస్టాడోమ్ కోచ్. రైల్వే పర్యాటక ప్రాంతాల్లో ఈ కోచ్‌లను వినియోగిస్తోంది. ఈ కోచ్ లోపల ఉండే ప్రయాణికులు బయటి ప్రాంతాలను ఎలాంటి అడ్డూ లేకుండా వీక్షించవచ్చన్న మాట. తాజాగా అలాంటి ఓ కోచ్‌తో కూడిన రైలు తెలంగాణ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అరకు మీదుగా సాగే రైలుకు గతంలో ఈ కోచ్‌ను ఏర్పాటు చేయగా, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పుణెకు వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఈ కోచ్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–పుణె మధ్య ప్రకృతి రమణీయతను పంచే ప్రాంతాలున్నందున, ఈ మార్గంలో కూడా ఇలాంటి కోచ్‌ను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని భావించిన రైల్వే శాఖ మూడు రోజుల క్రితం దీన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్–పుణె మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ గతంలోనే ప్రారంభించారు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత అది నిలిచిపోయింది. మళ్లీ పరిస్థితులు మెరుగుపడ్డాయని భావిస్తుండటంతో ఆగస్టు 10న పునరుద్ధరించారు. అయితే దీనికి విస్టాడోమ్ కోచ్‌ను జత చేసి ప్రవేశపెట్టడం విశేషం. సెల్ఫీలూ క్లిక్ చేయొచ్చు ఈ శతాబ్ది రైలులో మొత్తం 12 ఏసీ కోచ్‌లుంటాయి. ఇందులో ఒక విస్టాడోమ్ కోచ్, 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 9 చైర్‌కార్ కోచ్‌లుంటాయి. ఇవన్నీ అధునాతన లింక్ హఫ్మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు. విస్టాడోమ్ కోచ్‌లో ఫుల్ పుష్బ్యాక్తో ఉండే 40 సీట్లుంటాయి. ఇవి 360 డిగ్రీల మేర రొటేట్ చేసుకునేలా ఉంటాయి. కుర్చీలను పూర్తిగా కిటికీ వైపు తిప్పుకుని కూర్చోవచ్చు. వెలుపల చూడదగ్గ దృశ్యం మరో వైపు ఉంటే, వెంటనే కుర్చీలను అటు వైపు పూర్తిగా తిప్పుకోవచ్చు. ఆకాశం వైపు చూడాలంటే పూర్తిగా పుష్బ్యాక్ చేసి చేరగిలా పడుకుని చూడొచ్చు. కోచ్ వెనకభాగం మొత్తం పెద్ద అద్దంతో కిటికీ ఉంటుంది. అందులోంచి కూడా బయటకు చూసేందుకు వీలుగా విస్టాడోమ్‌ను చివరి కోచ్‌గా ఏర్పాటు చేశారు. ఇక విశాలంగా ఉంటే ఈ కోచ్‌లో సీట్లు ఉండే ప్రాంతం పోను కొంత భాగాన్ని లాంజ్‌గా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణికులు నిలబడి చుట్టూ చూడొచ్చు.. సెల్ఫీలు తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కోచ్ లోపలివైపు గోడలకు టీ, స్నాక్స్ పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉంది. ఇందులో ఎల్ఈడీ లైటు వెలుగులు, ఆటోమేటిక్‌గా తెరుచుకునే తలుపులుంటాయి. మంగళవారం మినహా ప్రతిరోజూ మంగళవారం మినహా మిగతా అన్ని రోజులు తిరిగే ఈ రైలు 8.25 గంటల వ్యవధిలో గమ్యం చేరుతుంది. ఇందులో టికెట్ చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. విస్టాడోమ్ కోచ్‌లో ఒక్కో ప్రయాణికుడు రూ.2,110 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలు (నంబర్ 12026) సికింద్రాబాద్ స్టేషన్లో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి పుణెకు రాత్రి 11.10కి చేరుకుంటుంది. పుణెలో (12025) ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.20కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. బేగంపేట, వికారాబాద్, తాండూరు, వాడి, కలబుర్గి, షోలాపూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
20 లక్షల ఏళ్లుగా వాన పడలే.. ఎక్కడో తెలుసా!
భూమ్మీద వందలు, వేల ఏళ్లుగా వాన అనేదే లేకుండా, పూర్తిగా పొడిగా ఉండే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఏముందీ.. ఏ సహారా ఎడారో, మరో ఎడారో అయి ఉంటుందిలే అనిపిస్తోందా? అస్సలు కాదు.. ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా ఖండంలో అలాంటి ‘కరువు’ ప్రాంతం ఉంది. చలితో గజగజ వణికిపోతున్న ఈ శీతాకాలంలో.. ఆ చలి ఖండంలోని చిత్రమైన ప్రాంతం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ మంచు మధ్య ‘కరువు’! భూమి దక్షిణ ధ్రువంలో కొన్ని కిలోమీటర్ల మందం మంచుతో కప్పబడి ఉన్న ఖండం అంటార్కిటికా. అత్యంత శీతలమైన ఈ ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. సుమారు 4,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాలను ‘డ్రై వ్యాలీస్’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటంగానీ, మంచు కురవడంగానీ జరగలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ, మంచుగానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మైనస్ 14 నుంచి మైనస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గడ్డ కట్టించే చలి ఉండటం గమనార్హం. మంచును కొండలు పట్టేసి.. నిజానికి అంటార్కిటికా ఖండంలోని గాలిలో తేమ శాతం ఎక్కువే. అలాంటి మంచు ఖండంలో ఇంతటి పొడి ప్రదేశాలు ఉండటానికి కారణం ‘కాటబాటిక్ విండ్స్’గా పిలిచే గాలులు కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డ్రైవ్యాలీస్ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్ అట్లాంటిక్’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రైవ్యాలీస్ వైపు వీచే గాలులు ఈ పర్వతాల కారణంగా వాతావరణంలో మరింత పైకి ఎగుస్తాయి. అక్కడి అతితక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. ఏమాత్రం తేమలేని పొడి గాలులు.. డ్రైవ్యాలీస్ వైపు ప్రయాణిస్తాయి. వీటినే ‘కాటబాటిక్ విండ్స్’ అంటారు. గాలిలో తేమ లేకపోవడంతో వానలు, మంచు కురవడం వంటివి అసలే ఉండవు. ఉప్పునీటి సరస్సులతో.. డ్రైవ్యాలీస్గా పిలిచే ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. ఎప్పుడో లక్షల ఏళ్ల కింద ఏర్పడ్డ ఆ సరస్సుల్లో అప్పటి నీరే ఉంది. వానలు, హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు. వేల ఏళ్లుగా వేసవికాలంలో స్వల్పంగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువ. ఆ నీళ్లు సముద్రపు నీటికన్నా మూడు రెట్లు ఉప్పుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిగా మంచినీటి మంచు ఖండంలో ఇలా ఉప్పునీటి సరస్సులు ఉండటం మరో వింత కూడా. అక్కడక్కడా ‘మమ్మీ’లు కూడా.. సమీపంలోని సముద్రం నుంచో, మధ్యలోని సరస్సుల నుంచో డ్రైవ్యాలీస్లోకి వచ్చిన సీల్ జంతువులు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి. ఇలా చనిపోయిన వాటి శరీరాలు వందలు, వేల ఏళ్లపాటు పెద్దగా చెడిపోకుండా ‘మమ్మీ’ల్లా ఉండిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కనీరు లేని పరిస్థితులు, తీవ్రమైన చలి, ఉప్పునీరు వంటివి దీనికి కారణమని తేల్చారు. రెండోస్థానంలో అటకామా ఎడారి అంటార్కిటికాలోని డ్రైవ్యాలీస్ను మినహాయిస్తే.. భూమ్మీద అత్యంత పొడిగా ఉండే ప్రాంతం అటకామా ఎడారి. చిలీ, పెరూ దేశాల మధ్య ఉన్న ఈ ఎడారిలో ఏళ్లకేళ్లు ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా ఏడాదికి ఒకట్రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుంది. మన దగ్గర ఒకట్రెండు నిమిషాల పాటు కురిసే వానకంటే అది తక్కువ. -
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
-
సుందర దృశ్యాల సిరి... అనంతగిరి
మన దగ్గరే! రాష్ర్టంలో పేరొందిన హిల్ స్టేషన్లలో ఒకటి అనంతగిరి. పచ్చని చెట్లతో అలరారే దట్టమైన అడవులు, గలగల పారే సెలయేర్లు... తేయాకు తోటల సుగంధాలు...ఇవీ అనంతగిరుల సోయగాలు. ఏడాది పొడవునా చల్లగా ఉండే ఈ ప్రాంతం వేసవి విడిదిగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కునగరంగా పేరుగాంచిన సుందరనగరం విశాఖపట్టణం. ఇక్కడి సముద్ర తీరానికి 40 కి.మీ దూరంలో ఉంది అనంతగిరి. ప్రకృతి ప్రేమికులను ఓ సరికొత్త లోకంలో విహరింపజేస్తుంది. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా నయనా నందకరంగా ఉండటంతో ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకుల మనసును రంజింపజేస్తాయి. అరకు లోయకు 17 కి.మీ దూరంలో తిరుమలగిరి పై భాగంలోని తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనందసాగరంలో ఓలలాడిస్తుంది. రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఇక్కడ వనమూలికలు సైతం లభ్యమవుతాయి. భవనాశి సరస్సు దక్షిణ బద్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సు ఉంది. అత్యంత పవిత్రమైనదిగా ఈ సరస్సుకు పేరు. ఈ సరస్సు వల్లే ఈ ప్రాంతానికి దక్షిణ బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కాఫీ తోటల పరిమళాలు, పక్షల కిలకిలరావాలు, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది. మామిడి తోటలు కూడా పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. అనంతపద్మనాభుడు ప్రకృతి రమణీయత ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తే, ఇక్కడి వచ్చే యాత్రికులను భక్తిపారవశ్యంలో నింపుతుంది అనంతపద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికులు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు ఇక్కడి ఎత్తై ప్రాంతాలు, సెలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను చూపులను కట్టి పడేస్తాయి. వెళ్లేదారి.. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి 3 కి.మీ దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. విశాఖపట్టణం నుంచి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, బంగళాలు అందుబాటులో ఉన్నాయి.