Value of the land
-
సర్వేయర్లకు కాసుల పంట.!
స్పష్టత లేని జీవోపై రైతుల ఆవేదన చేతిచమురు వదులుతోందని గగ్గోలు ఒక పక్క జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెరిగిన భూమి విలువతో పుట్టుకొస్తున్న వివాదాలు... ఈ రెండింటికి ఒకటే పరిష్కార మార్గం.. భూమి సర్వే చేసి హద్దులు నిర్థారిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.... దీనికి అనువుగా ప్రభుత్వం ప్రత్యేక సర్వేయర్లను నియమించినా, వారికి చెల్లించే రుసుంపై స్పష్టత లేకపోవడంతో చేతిచమురు వదులుతోందని రైతులు వాపోతున్నారు. నర్సీపట్నం : స్పష్టతలేని ప్రభుత్వ విధానాలు రైతులను అవస్థలపాల్జేస్తున్నాయి. సర్వేయర్ల విషయంలో ఇదే సమస్యను రైతులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది వరకు మండలానికి ఒక ప్రభుత్వ సర్వేయర్ ఉండేవారు. రైతులు నేరుగా మీ సేవలో రూ. 250 చెల్లిస్తే రెవెన్యూ అధికారుల ఆదేశంతో వారు సంబంధిత రైతుల భూములను కొలిచి హద్దులు నిర్ణయించేవారు. గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకు న్నాయి. భూమి అమ్మకాలు, కొనుగోళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా సర్వే పనులు సైతం పెరుగుతూ వచ్చాయి. దీంతో ఎక్కువ శాతంలో ధరఖాస్తులు రావడం, వాటి పరిష్కారానికి అవసరమైన సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో పెండింగ్ జాబితా చాంతాడంత పెరుగుతూ వచ్చింది. పేరుకుపోయిన సర్వే దరఖాస్తులు నర్సీపట్నం డివిజన్లో ఒక్క ఎస్ రాయవరం మండలంలోనే 495 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులను గమనించిన ప్రభుత్వం రెవెన్యూ సర్వేయర్లతో పాటు అదనంగా మరికొంతమందిని నియమించింది. అర్హత ఉన్న వారిని గుర్తించి వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్వేకు వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ విధంగా డివిజన్లో ప్రభుత్వ సర్వేయర్లు పది మందితో పాటు ఒక్కో మండలానికి ఐదుగురు లెసైన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విధంగా ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించినా సమస్య పరిష్కారానికి గతంలో మాదిరిగానే ఈ సేవ లో చెల్లించే రుసుంలో ఎటువంటి మార్పులు చేయలేదు. తప్పని మామూళ్ల బెడద రైతులు తమ భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించేందుకు వచ్చిన దరఖాస్తులను గుర్తించిన తహశీల్దార్లు పరిష్కార బాధ్యతను సర్వేయర్లకు ఇంతవరకు బాగానే ఉన్నా తహశీల్దారు ఆదేశాలతో హద్దులు నిర్ణయించే లెసైన్స్డ్ సర్వేయర్లు ఎకరానికి కొంత మొత్తం చెల్లించాలంటూ రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఎకరానికి రూ. రెండు వేల వరకు గుంజుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకున్నా నేరుగా క్షేత్రస్థాయిలో ఈ వసూళ్లకు పాల్పడుతుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్తులో భూమి సర్వే చేయించాలంటేనే రైతులు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని పలువురు ఆవేదన చెందుతున్నారు. రూ.500 మాత్రమే రైతు చెల్లించాలి ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఎక్కువగా ఉంది. దీనివల్ల సర్వేకు అందిన దరఖాస్తుల పరిష్కారానికి జాప్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మండలానికి ఐదుగురు లెసైన్డ్ సర్వేయర్లను తీసుకుంది. సర్వే జరిపించేకునే రైతు సర్వే రుసుం ప్రభుత్వానికి మీసేవ ద్వారా చెల్లించాలి. సర్వే జరిపినందుకు లెసైన్‌సడ్ సర్వేయర్‌కు రూ.500 రైతే చెల్లించుకోవాలి. - ఎంఆర్పీ బాబు, డివిజనల్ సర్వేయర్, నర్సీపట్నం -
రేపటి నుంచి రిజిస్ట్రేషనూ భారమే!
25 శాతం మేర పెరగనున్న భూముల విలువ ఏడాదికి రూ.25 కోట్లు పెరగనున్న ఆదాయం తిరుపతి అర్బన్: రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటివరకు స్థలాల బయటి మార్కెట్ ధరలకు, రిజిస్ట్రేషన్ శాఖలో అమలవుతున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. అందులో రిజిస్ట్రేషన్ శాఖ ధరల కన్నా మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్న అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ధరలను కూడా పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై స్థలాలు, భూములు, ప్లాట్ల ధరలు సుమారు 25 శాతం మేరకు పెరిగి వినియోగదారులపై రిజిస్ట్రేషన్ భారం పడనుంది. అయితే జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి ప్రాంతాల్లో భూముల ధరలను పెంచకుండా యథాస్థితిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ డం గమనార్హం. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ల విలువ పెరగనున్న దృష్ట్యా తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, మదనపల్లి, కుప్పం, పీలేరు, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్, చంద్రగిరి, నగరి ప్రాంతాల్లోని ప్లాట్లు, స్థలాల రిజిస్ట్రేషన్ల ధరలూ ఒక మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉంటాయని రిజిస్ట్రేషన్ వర్గాలు వెల్లడించాయి. భూములు, స్థలాల విలువ పెరగడం, తద్వారా రిజిస్ట్రేషన్ ధరలు పెరిగితే జిల్లా వ్యాప్తంగా ఏడాదికి సుమారు రూ.25 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. కానీ ఆయా ప్రాంతం ఆధారంగా స్థలాలు, భూముల విలువలు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల్లో పెరిగిన ఆదాయం ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ధరలూ పెరిగే అవకాశం ఉన్న కారణంగా గత మూడు నెలలుగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఆ ప్రభావంతో తిరుపతి బాలాజీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆదాయం కూడా బాగా పెరిగి 106 శాతం లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆదాయ లక్ష్యం రూ.31.27 కోట్లు కాగా రూ.33.27 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2014లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చిన ఆదాయం రూ.24.79 కోట్లతో పోల్చితే ఈ ఏడాది ఆదాయం 34 శాతం అదనంగా పెరిగింది. అలాగే ఈ నెల మొత్తం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో జిల్లా కార్యాలయం రద్దీగా కనిపిస్తోంది. -
పదహారేళ్లుగా వెట్టి
ఆ భూమి లక్షల విలువ చేస్తోంది. ఆత్మకూర్ శివారులోనే ఉన్న ఆ వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ఉప కేంద్రం నిర్మించేందుకు పూనుకున్నారు. దీనికి గాను భూమి ఇస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి లక్షల విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకొని నేటి కీ భూమి ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వనేలేదు. వివరాలు.. ఆత్మకూర్ మండలం ఖానాపూర్ శివారులో (ఆత్మకూర్‌కు అతి సమాపంలో) ఉన్న సర్వే నెం.128లో ఖానాపూర్‌కు చెందిన కుర్వ మల్లేష్‌కు సంబంధించిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆత్మకూర్‌లో విద్యుత్ ఉప కేంద్రం లేని కారణంగా పట్టణ శివారులో ఉన్న ఆ భూమిని ట్రాన్స్‌కో అధికారులు ఎంపిక చేశారు. ఆ భూమిలోంచి అర ఎకరం ఇస్తే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో లక్షల విలువ చేసే భూమిని 1997లో అధికారులకు అప్పజెప్పారు. అనంతరం విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం పూర్తి స్థాయిలో జర గడంతో సెప్టెంబర్ 29, 1998లో ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్తకోట దయాక ర్‌రెడ్డి, ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ కేఎస్ఎన్మూర్తి, ఎస్ఈ వైసీ కొండారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం వికలాంగుడైన కుర్వ మల్లేష్‌కు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక వాచ్‌మెన్‌గా విధుల్లో చేర్చుకున్నారు. ఐదేళ్లపాటు కాస్తో, కూస్తో జీతం చెల్లిస్తూ వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అనంతరం తమకు వాచ్మెన్ అక్కరలేదని అధికారులు పేర్కొనడంతో మల్లేష్ బిత్తరపోయాడు. ఈ విష యమై ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు కాళ్లావేళ్లా పడి ప్రాధేయప డ్డా ఇది తమ చేతుల్లో ఏమీ లేదని, ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చిచెప్పడం గమనార్హం. ఉన్న కాస్త భూ మిలో వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు పాతి తీగలు ఉండటంతో వ్యవసాయానికి ఆ భూమి ప నికిరాకుండా పోయిం దని, జీవనాధారం కోల్పోయామని బాధిత కుటుంబం ఆందోళ న వ్యక్తం చేస్తోంది. అరుునా తనపై అధికారులకు కనికరం వ స్తుందేమోనని ప్రతిరోజు అతను విధులకు హాజరవుతున్నాడు. ట్రా న్స్‌కో అధికారులు ఎలాంటి వేతనం ఇవ్వకపోవడంతో తోటి కాంట్రాక్ట్ కార్మికులు నలుగురు రూ.500 చొప్పున ప్రతినెల రెండువే లుఇస్తూమానవత్వాన్ని చాటుకుంటున్నారు.