Vamsy
-
హీరోయిన్ భానుప్రియను పెళ్లాడాలనుకున్నారా? డైరెక్టర్ ఆన్సరిదే!
సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడరు, గోపి గోపిక గోదావరి,అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో విభిన్న సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించాడు డైరెక్టర్ వంశీ. హీరోయిన్ భానుప్రియను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే! చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.నా సినిమాతోనే భానుప్రియకు అలాంటి ఆఫర్లుభానుప్రియ తన కెరీర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుంటుందని నన్ను అడిగేది. సితార మూవీ తర్వాత తను బిజీ అయింది. అయితే తనకు మోడ్రన్ లుక్‌లో కనిపించే పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందేది. దీంతో నేను అన్వేషణ మూవీలో తనను గ్లామరస్‌గా చూపించాను. ఆ సినిమా బాగా ఆడింది. అప్పటినుంచి తనకు గ్లామర్ పాత్రలు వచ్చాయని తనే చెప్పింది. 35 ఏళ్లుగా చూడలేదుతనను కలిసి దాదాపు 35 ఏళ్లు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో వంశీ.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా అందుకు వంశీ స్పందించలేదు. అది ఎప్పుడో గతానికి సంబంధించినది.. అదంతా పాత కథ. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నా భార్య కూడా చనిపోయింది. నా పెద్ద కూతురు చెన్నైలో, చిన్న కూతురు నా దగ్గరే ఉంటుందని తెలిపాడు.చదవండి: పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్ -
‘ఫ్యాషన్ డిజైనర్ ' మూవీ స్టిల్స్
-
ఫ్యాషన్ డిజైనర్‌పై మంచు లక్ష్మీ ఫైర్
సీనియర్ దర్శకుడు వంశీ, లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్గా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఓ డిజైనర్., అమ్మాయి కొలతలు తీసుకుంటున్నట్టుగా ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత మధుర శ్రీధర్, 'వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ప్రీ లుక్ ఇదే.. ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలోనే రిలీజ్ అవుతుంది' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రీ లుక్‌పై స్పందించిన మంచు లక్ష్మీ ' మనం అమ్మాయిలను ఇలా చూపించడం ఎప్పుడు మానేస్తాం' అంటూ కామెంట్ చేసింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచు లక్ష్మీకి మద్ధతు తెలిపింది. వెంటనే స్పందించిన మధుర శ్రీధర్ మంచు లక్ష్మీకి సమాధానం ఇచ్చాడు. 'మేము ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్టర్‌ను రిలీజ్ చేయలేదు. సినిమాలోని ఒక సన్నివేశం నుంచి ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాం.' అంటూ ట్వీట్ చేశారు. అయితే మంచు లక్ష్మీ ట్వీట్‌పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జుమ్మందినాథం, గుండెల్లో గోదారి లాంటి సినిమాల్లో తాప్సీని బొల్డ్‌గా చూపించినప్పుడు స్పందించని లక్ష్మీ, ఇప్పుడు ఈ పోస్టర్‌ను తప్పు పడ్డటం ఏంటీ..? అన్న వాదన వినిపిస్తోంది. Dear Friends! Here is the Pre-Look of Vamsy's FASHION DESIGNER s/o LADIES TAILOR. Thank you! First Look very soon!!! #FashionDesigner pic.twitter.com/ny4bXiXYCA — Madhura Sreedhar (@madhurasreedhar) 31 March 2017 When will we stop objectifying women like this. :( https://t.co/G986saczvu — Lakshmi Manchu (@LakshmiManchu) 1 April 2017