నార్పలలో ‘వంగవీటి’ షూటింగ్ సందడి
నార్పల : నార్పలలో వంగవీటి సినిమా షూ టింగ్తో సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం శ్రీనివాస థియేటర్ ఎదుట, శ్రీని వాస రైస్ మిల్లోనూ ఘర్షణలకు సంబంధించి చిత్రీకరించారు.
రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో షూటింగ్ సా గిం ది. జిల్లా కేంద్రంలో కొన్ని సీన్స్లను చిత్రీకరించి, అనంతరం నార్పల సమీపంలోని మడుగుపల్లి కనుమ వద్ద, గాలిమరల కొం డల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.