Varadharaja Swamy Temple
-
మళ్లీ 40 ఏళ్ల తర్వాతే దర్శనం
కాంచీపురం అత్తివరదరాజస్వామి తిరిగి కోనేటిలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకే ఆయన భక్తులకు దర్శమిస్తారు. 48రోజుల్లో దాదాపు 2కోట్లమంది అత్తివరదర్ పెరుమాళ్‌ని దర్శించుకున్నారని అంచనా. కాంచీపురం అత్తి వరదరాజస్వామి మళ్లీ కోనేటి ప్రవేశం చేశారు. 48రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చి... కోనేటి గర్భంలోకి వెళ్లిపోయారు. మళ్లీ 40ఏళ్లకు బయటకు వస్తారు. ఈ 48 రోజుల్లో తొలి 38 రోజులు శయనస్థితిలోనూ, మిగిలిన 10 రోజులు నిలబడినట్లు భక్తులకు దర్శనమిచ్చారు అత్తివరదర్ పెరుమాళ్. దక్షిణాపథంలోని ఏకైక మోక్షపురంగా ప్రసిద్దిగాంచిన కంచిలో ఉన్న వెయ్యికి పైగా ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉంటాయి. వరదరాజస్వామి విగ్రహాం అత్తిచెక్కతో నిర్మితమైంది. 9 అడుగుల పొడవు ఉండే ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ రూపొందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన మహమ్మదీయుల దండయాత్రలో కంచి దేవాలయం దోపిడీకి గురైందని, ఆ సమయంలో విగ్రహాన్ని కాపాడేందుకు వెండి పెట్టెలో పెట్టి ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన అడుగుభాగంలో భద్రపరిచారని పెద్దలు చెబుతారు. పరిస్థితులు చక్కబడ్డాక పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహ ఆనవాళ్లు తెలియకపోవడంతో.. గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. మూలవిరాట్ లేకపోవడంతో వేరే విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు. కొన్నాళ్ల తర్వాత కోనేరు ఎండిపోవడంతో వెండి పెట్టెలోని ప్రధాన విగ్రహం బయటపడింది. అత్తితో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా చెక్కచెదరకపోవడంతో దానిని తిరిగి ప్రతిష్టించారు. 48 రోజులపాటు క్రతువులు నిర్వహించి మళ్లీ కోనేటిలో భద్రపరిచారు. కాలానుగుణంగా ఇదే సంప్రదాయంగా మారింది. అప్పటినుంచి కోనేరులో భద్రపరిచిన విగ్రహాన్ని 40 ఏళ్లకోసారి తీసి 48 రోజులపాటు పూజలు చేసి మళ్లీ కోనేరులో భద్రపరుస్తున్నారు. 1854 నుంచి ఇలా చేస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్ట్ 17 వరకూ ఈ మహాక్రతువు నిర్వహించారు. జూలై 1 నుంచి సుమారు రెండు కోట్లమంది భక్తులు అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు పెరుమాళ్ సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ప్రధాని దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ దంపతులు, నటి నయనతార తదితరులు అత్తివరదరాజ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: 40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు -
ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
సాక్షి, చెన్నై : కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. తొక్కిసలాటలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నారాయణమ్మ ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. నలబై ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే అత్తివరదర్ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ గుడి పైపు దూసుకొచ్చారు. దీంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. (చదవండి : 40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు) కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కొలువైన అత్తివరదర్ స్వామి 40 ఏళ్లకోసారి దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అత్తివరదర్ స్వామి దర్శన కార్యక్రమాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పూజాది లాంఛనాలతో ప్రారంభించగా... గత 18 రోజులుగా స్వామి దర్శనం కోసం భక్తులు వస్తూనే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. -
40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు
-
40 ఏళ్లకోసారి దర్శనం.. పోటెత్తిన భక్తులు
సాక్షి, కాంచీపురం: నలబై ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే కాంచీపురంలోని అత్తివరదర్ స్వామి కోసం భక్తులు పోటెత్తారు. ఇక్కడి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కొలువైన అత్తివరదర్ స్వామి 40 ఏళ్లకోసారి దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా అత్తివరదర్ స్వామి దర్శన కార్యక్రమాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పూజాది లాంఛనాలతో ప్రారంభించగా... గత 15 రోజులుగా స్వామి దర్శనం కోసం భక్తుల వస్తూనే ఉన్నారు. దేశం నకుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులతోపాటు లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. తమిళులకు శుభంగా భావించి శుక్ర, శనివారాల్లో భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో వరదరాజ పెరుమాళ్ ఆలయ పరిసరాలతోపాటు కాంచిపురంలో తిరుమాడ వీధులు జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కూలిన వరదరాజస్వామి ఆలయ ప్రహరీ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని అతి పురాతనమైన మాణిక్య వరదరాజస్వామి ఆలయ ప్రహరీ ఆదివారం కూలిపోయింది. ఈ శిధిలాలు గర్భగుడిపై పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బలహీనపడిన గోడ కూలిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే చోళుల కాలం నాటి ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే. రాగి చెట్లు పెరుగుతూ శిధిలావస్థకు చేరిన ఆలయ ప్రహారీ గురించి 'సాక్షి' ఎన్నో సార్లు కథనాలను ప్రచురించింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ ప్రహారీ కుప్ప కూలింది.