రాజకీయ ఖైదీలకు అండగా నిలవాలి
రాజకీయ ఖైదీలకు సమాజం అండగా నిలవాలి. నిర్ణీత కాలం శిక్ష పూర్తి చేసుకున్న వారిని కూడా ప్రభుత్వాలు విడుదల చేయడం లేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శిక్ష కాలం సగం పూర్తి చేసుకున్న విచారణ ఖైదీలను విడుదల చేయూలి.
హన్మకొండ సిటీ : రాజకీయ ఖైదీలకు బయటి సమాజం అండగా నిలవాల్సిన అవసరముంద ని విప్లవ రచయితల సం ఘం నేత వరహరావు అన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్‌తో పాటు వరంగల్ కేంద్ర కారాగారంలోని ఖైదీల దీక్షకు మద్దతుగా సోమవారం ధర్నా జరిగింది. హన్మకొండలోని ఏకశిలా పార్కులో కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్(సీఆర్పీపీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా లో వరవరరావు మాట్లాడారు.
దేశవ్యాప్తంగా జైళ్లలో దీక్షలు
బ్రిటీష్ వలస పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి విప్లవకారుల్లో స్ఫూ ర్తి నింపిన జతిన్‌దాస్ లాహోర్ జైలులో 1929 సెప్టెంబర్ 19న అమరుడయ్యాడని.. అప్పటి నుంచి సెప్టెంబర్ 13న రాజ కీయ ఖైదీల హక్కుల దినంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో రాజకీయ ఖైదీలు నిరాహార దీక్షలు చేస్తున్నారని వరవరరావు తెలిపారు. 1999లో కూడా పటే ల్ సుధాకర్, అప్పారావు ఖైదీల హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు 43 డిమాండ్లు ప్రతిపాదించగా పాలకులు వా టిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా నిర్బంధంలో ఉన్న ఖైదీల పట్ల పాలకులు, అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
జీవిత శిక్ష అనుభవించిన వారి పట్ల కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారు నిర్ణీత కాలపు శిక్ష పూర్తి చేసుకున్న విడుదల చేయకుండా జాప్యం చేస్తూ హింసిస్తున్నారని వరవరరావు పేర్కొన్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ వెంటనే నిలిపివేయాలని, రాజకీయ ఖైదీ లను విడుదల చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సగం శిక్షకాలం పూర్తయిన విచారణ ఖైదీలను విడుదల చేయడంతో పాటు జైళ్లలో జరుగుతున్న అసహజ మరణాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూఢిల్లీకి చెందిన రోనా విల్సన్ మాట్లాడుతూ తూర్పు, మధ్య భారతంలో ఆదివాసీలపై పాలకులు గ్రీన్‌హంట్ పేరుతో దాడి చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఆర్పీపీ ప్రధాన కార్యదర్శి బల్ల రవీంద్రనాథ్ మాట్లాడుతూ దేశమే పెద్ద జైలుగా మారగా, దోపిడీ, దాడులు, అణచివేతలు, అత్యాచారాలు, నిరుద్యోగం వంటి సామాజిక సమస్యలు పట్టి పీడిస్తున్నాయని అందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని జైలు లో పెడుతున్నారని, ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. ధర్నాలో ప్రజాసంఘాల నాయకులు పద్మ కుమారి, ఎర్ర నర్సింహారెడ్డి, సావిత్రి, బాసిత్, శాంత, లింగారెడ్డి, సురేష్, బాలకుమార్, సుదర్శన్, బాదావత్ రాజు, నల్లెల రాజయ్య పాల్గొన్నారు.