విద్యుదాఘాతానికి వ్యక్తి బలి
ఎస్కేయూ: అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన వరికూటి సూరి(45) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై సోమవారం మరణించినట్లు ఇటుకలపల్లి ఎస్ఐ అబ్దుల్ కరీం తెలిపారు. ఇటుకలపల్లి సమీపంలోని ద్రాక్ష తోటలో కటింగ్ చేస్తుండగా, పందిరికి విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. ఘటనలో మరో ముగ్గురు షాక్కు గురయ్యారన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య సహా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.