వర్మ పట్టాడు
ఎంసెట్‌కు సన్నద్ధం కావల్సిన రాజేష్ ప్రవర్తన విచిత్రంగా మారుతుంది. అతన్ని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళతారు. సినిమా అవకాశాలు రాక సైకియాట్రిస్ట్‌గా మారిన సదరు వైద్యుడు రాజేష్‌కు ‘పవనిజం’తో మొదలు పెట్టి అన్ని సినీ ఇజాలనూ చూపిస్తుంటాడు. వర్మ ఇజం మొదలు పెట్టగానే... ‘నేనే ఆర్జీవీ’ అన్నట్టు మాట్లాడుతుంటాడు. నచ్చింది చెయ్యాలనే రాంగోపాల్‌వర్మ సిద్ధాంతాన్ని నమ్మిన రాజేష్... తనకు ఇష్టమైన డ్యాన్స్ వైపు మొగ్గుచూపుతాడు.
కానీ ఇంట్లో వాళ్లను కాదనలేక, చదవలేక ఇలా వర్మ పట్టినట్టు ప్రవర్తింస్తుంటాడు. సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ప్రారంభిస్తాడు. రాజేష్‌కు నయమైపోతుంది. కానీ సైకియాట్రిస్ట్ మాత్రం విచిత్రంగా మారిపోతాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో పిల్లలను.. వారికి నచ్చిన రంగంలోనే ఎంకరేజ్ చేయాలని చెప్పిన సందేశం ఆకట్టుకుంది. దర్శకుడు మహేష్ ఈ లఘు చిత్రాన్ని ఫన్నీ వేలో రక్తికట్టించగలిగాడనే చెప్పాలి.
-ఓ మధు