పల్స్ పోలియో విజయవంతం
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైనట్లు జాయింట్ డైరెక్టర్ వీణాకుమారి అన్నారు. మంగళవారం డీఎంహెచ్ఓ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడ్రోజల పాటు వంద శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేశామన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు, సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని కితాబిచ్చారు.
అనంతరం ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక జబ్బుల నివారణపై రూపొందించిన ‘మానసిక కుంగుబాటు గురించి మాట్లాడుకుందాం’ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, ప్రోగ్రాం ఆఫీసర్లు అనిల్‌కుమార్, సుధీర్‌బాబు, సుజాత, పురుషోత్తం, దోసారెడ్డి, డెమో హరిలీలాకుమారి, ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.