విజయవాడలో మహిళ దారుణ హత్య
విజయవాడ వన్ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ భాగస్వామి చేతిలో దారుణ హత్యకు గురైంది. పి.నైనవరంలో నివసించే కొప్పోజి వీరకుమారస్వామి (42)కి భార్య చంద్రావతి ఉండగా... షర్మిల (22) అనే యువతితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. గత రెండు రోజులుగా కుమారస్వామికి, షర్మిలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కుమారస్వామి గొడ్డలితో షర్మిలను నరికి చంపాడు. కొత్తపేట పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.