Veerashaiva Lingayat
-
కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం
బనశంకరి: రిజర్వేషన్లను పెంచాలని వాల్మీకులు, ఎస్టీల్లో చేర్చాలని కురుబలు, తమనూ బీసీలుగా గుర్తించాలని అగ్రవర్ణ వీరశైవ, లింగాయత్‌ల ఆందోళనలు కర్ణాటకలో ఊపందుకున్నాయి. నెలరోజుల నుంచి ఎవరికి వారు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ యెడియూరప్ప సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆఖరికి మంత్రులు సైతం తమ వర్గాల సమావేశాల్లో పాల్గొంటూ గళమెత్తడంతో సీఎం యెడియూరప్పకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గుణపాఠం తప్పదన్న పంచమసాలిలు .. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆదివారం లింగాయత పంచమసాలి వర్గీయులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వర్గీయులు అధికంగా ఉండే కలబురిగి, విజయపుర, బాగల్‌కోటే, యాదగిరి, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, హావేరి, ధారవాడ, బెళగావిల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బీసీల్లో 3బీ గా ఉన్న తమను తక్షణం 2ఏ కు మార్చి రిజర్వేషన్ వసతులను పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూడల సంగమ పంచమసాలి పీఠాధిపతి శ్రీ బసవజయ మృత్యుంజయ స్వామీజీ మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తమ వర్గం స్వామీజీల నేతృత్వంలో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు రిజర్వేషన్ ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. సమావేశంలో మంత్రులు మురుగేశ్ నిరాణి, సీసీపాటిల్, అన్ని పార్టీల నుంచి 20 మందికిపైగా ఎమ్మెల్యేలు, స్వామీజీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు ? వరుస ఆందోళనల నేపథ్యంలో సీఎం యెడియూరప్ప అన్ని వర్గాలను బుజ్జగించేలా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రిమండలిలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని మంత్రులకు స్పష్టంచేశారు. -
గుంటూరులో వీరశైవ లంగాయత్ల మహాసభ
-
వారు హిందువుల్లో భాగమే
మంగుళూరు: లింగాయత్‌లలో లింగాయత్, వీరశైవ సంప్రదాయాలు ఉన్నప్పటికీ అవి రెండూ హిందూమతంలో భాగమేనని పర్యాయ పెజావర్ మఠం పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి అన్నారు. కర్ణాటకలోని ఉడిపిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లింగాయత్, వీరశైవ సంప్రదాయాలు ద్వైత, అద్వైత సిద్ధాంతాల వంటివేనని చెప్పారు. ద్వైత, అద్వైత సిద్ధాంతాల్లో ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ అవి రెండూ వైదిక మతంలో భాగమేనని అలాగే లింగాయత్, వీరశైవం రెండూ వేర్వేరు సంప్రదాయాలు అయినప్పటికీ అవి హిందూ మతం నుంచి భిన్నమైనవి కావన్నారు. కర్ణాటకలో బలమైన సామాజికవర్గంగా ఉన్న లింగాయత్‌లు 12వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త బసవేశ్వరుని అనుసరిస్తుంటారు. లింగాయత్, వీరశైవ సంప్రదాయాలూ ఒకే మతానికి సంబంధించినవని ఇరువర్గాలూ అంగీకరిస్తే వీరశైవ–లింగాయత్ కమ్యూనిటీకి మరింత బలం చేకూరుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తన ఉద్దేశం కాదని, ఈ అంశంపై ఇరు వర్గాలూ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే బీసీ రుణాలపై సబ్సిడీని రూ.30 వేల నుంచి లక్షకు పెంచాలన్నారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన 22 బీసీ సంఘా ల భేటీలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సు ల పూర్తి ఫీజుల్ని సర్కారే భరించి రూ.35 వేల పరిమితిని ఎత్తివేయాలన్నారు. వీరశైవ లింగాయత్ నూతన కార్యవర్గం: ఇదే సమావేశంలో వీరశైవ లింగాయత్ కొత్త కార్యవర్గాన్ని కృష్ణయ్య ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా పట్లోల్ల సంగమేశ్వర్, అధ్యక్షుడిగా బెడఖాని హన్మంతు, సెక్రటరీ జనరల్‌గా వెన్న ఈశ్వరప్ప, ఉపాధ్యక్షుడిగా ఎం.వీరయ్య, కార్యదర్శిగా చంద్రకాంత్ పాటిల్, కోశాధికారిగా ఎ.చంద్రశేఖర్‌ను నియమించారు. ఆర్ఎంపీలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలి: రాష్ట్రంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి వారికి మెడికల్ డిప్లొమా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ జరిగిన తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్యవేదిక ‘శంఖారావం’ రాష్ట్ర సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లు పెట్టుకోవడానికి ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం 50% సబ్సిడీపై 2 నుంచి రూ.5 లక్షల వరకు రుణాలందించాలని కోరారు.