Vegetable cutting
-
ముక్కలుగా.. ఆ తర్వాత పేస్ట్‌లా మార్చే మాన్యువల్ చాపర్
కూరగాయలను, పండ్లను అవసరాన్ని బట్టి, ఇట్టే ముక్కలుగా, పేస్ట్‌లా అందించే మాన్యువల్ చాపర్ ఇది. దీనికి పవర్‌తో పని లేదు. మల్టీ–బ్లేడ్ డిజైన్ కలిగిన ఈ డివైజ్‌లో పండ్లు లేదా కూరగాయలు ఈ బౌల్లో వేసుకుని.. మూత పెట్టి, ఆ మూత పైభాగంలో ఉన్న రెడ్ లేదా గ్రీన్ కలర్ హ్యాండిల్‌ని ఒక చేత్తో పట్టుకుని, మూతపైన మరో చేయి వేసి నొక్కి పెట్టి.. హ్యాండిల్‌ని ఫోర్స్‌గా మనవైపుకి లాగితే.. లోపల ఉన్న పదార్థాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి. అలా అయిదుసార్ల కంటే ఎక్కువ లాగితే కూర తయారీకి సరిపడా ముక్కల్లా, ఎనిమిదిసార్ల కంటే ఎక్కువ లాగితే చట్నీలా, పన్నెండుసార్ల కంటే ఎక్కువ లాగితే జ్యూస్‌లా మారుతుంది. టొమాటో, ఆనియన్, కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని స్పైసీ సల్సా తయారు చేసుకోవచ్చు. తులసి, పైన్ నట్స్, వెల్లుల్లి, లవంగాలు, ఆలివ్ నూనె వేసుకుని పర్ఫెక్ట్ పెస్టో రెడీ చేసుకోవచ్చు. బనానా, స్ట్రాబెర్రీ, పైనాపిల్ ముక్కల్లో పెరుగు, తేనె వంటివి జోడించి టేస్టీ జ్యూస్ చేసుకోవచ్చు. భలే బాగుంది కదూ. -
కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి
జైపూర్: అత్తాకోడళ్ల మధ్య ఎప్పుడూ పొసగదు. భర్త, కుమారుడితో బాగానే ఉండే వీరు వారిద్దరూ ఎదురుపడ్డప్పుడు ఏం జరుగుతుందో ఏమో అగ్గిమీద గుగ్గిలమవుతారు. గుంటూరు జిల్లాలో చపాతీ కర్రతో అత్తపై దాడి చేసిన ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు కోయమని చెప్పడంతో ఆ కోడలు అత్తపై కత్తితో దాడి చేసింది. సరిగ్గా తరగకపోవడంతో దుర్భాషలాడడంతో కోడలు క్షణికావేశంలో అదే కత్తితో పొడిచింది. 26 పోట్లు పొడవడంతో అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దాడి చేసిన అనంతరం కోడలు తట్టాబుట్టా సర్దేసుకుని పరారైంది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. (చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే!) జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు మోహినీ దేవి (62) తన కుమారుడికి పద్నాలుగేళ్ల కిందట మమతాదేవీ (35)తో వివాహం జరిపించింది. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట కోసం కోడలు కూరగాయలు తరుగుతోంది. అయితే సక్రమంగా కోయడం లేదని అత్త మోహిని తిట్టింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక తట్టుకోలేని కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్తపై దాడికి పాల్పడింది. ఏకంగా 26 చోట్ల పొడవడంతో మోహినీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోడలు తన సామగ్రి, పిల్లలను తీసుకుని పరారైపోయింది. స్థానికుల సమాచారంతో ఇంటికి వచ్చిన కుమారుడు రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించాడు. ఆమె చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూసింది. తన తల్లిని హతమార్చిన భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారైన కోడలు మమతను పోలీసులు గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మమతకు ఇద్దరు అబ్బాయిలు, ఓ కుమార్తె ఉంది. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి -
కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె!
-
కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె!
ఆలూమగలన్నాక కోపతాపాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ చెరిసగం పంచుకుంటూ ప్రేమ అనే నావతో సంసార సాగరాన్ని ఈదక తప్పదు. అయితే నచ్చింది కొనివ్వడం లేదని, పనుల్లో కాస్తైనా సాయం చేయడం లేదని భార్య కట్టుకున్నవాడి మీద కస్సుబుస్సులాడుతుంది. ఆమె కోరికల చిట్టాను తీర్చాలంటే కుబేరుడి దగ్గర ఉన్న ధనం కూడా సరిపోదని, ఆమె వాగుడుతో వేగలేకున్నామని భార్య మీద అసహనం వ్యక్తం చేస్తుంటారు మగ మహానుభావులు. కానీ ఇక్కడో కోతి మాత్రం ఓ మహిళకు నేనున్నానంటూ వంటపనిలో సాయం చేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ మహిళ కూరగాయలు కట్ చేస్తోంది. సాయం చేయడానికి నేనున్నాగా అన్నట్లుగా ఓ కోతి అక్కడే బుద్ధిగా కూర్చుంది. దీంతో ఆమె తన చేతిలో ఉన్న వాటిని కోతి ఎదురుగా ఉన్న గిన్నెలో వేసింది. ఇంకేముందీ వానరం వాటన్నింటినీ చకాచకా చేతితో విరుస్తోంది. దానికి ఇంతకుముందే ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఎంతో స్పీడ్‌గా పని చేయడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె' అని ఒకావిడ తన భర్త ఏ సాయమూ చేయడని చురకలంటించగా, దీనికి ఇంత టాలెంట్ ఎక్కడ నుంచి వచ్చిందోనని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చదవండి: గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం! వైరల్: బుర్ర పనిచేసింది.. లేదంటే.. అచ్చం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలా.. -
కత్తిపీట మీద సామే
- మండుతున్న కూరగాయల రేట్లు - ఉష్ణోగ్రత కారణంగా తగ్గిన దిగుబడి - ఉల్లిపాయల ధరా అదే దారిలో.. అమలాపురం, న్యూస్‌లైన్ : తగలబడుతున్న కారడవి నుంచి వీస్తున్నట్టు గాలి పగలూ, రాత్రీ సెగలు కక్కుతోంది. నీడ పట్టున ఇంట్లోనే ఉన్నా.. పగబట్టినట్టు వాతావరణం హింసిస్తోంది. ఇక.. కూరో, వేపుడో వండుతూ వంటిళ్లలో మండే స్టౌల ముందుండే ఇల్లాళ్ల అవస్థ చెప్పనక్కరలేదు. అక్కడున్నంతసేపూవారికి చిత్రహింసగానే ఉంటోంది. ఉల్లి ఘాటుకు మండుతున్న కంట్లోనే నలుసు పడ్డట్టు- ఇప్పుడా అవస్థకు భగ్గుమంటున్న కూరగాయల ధరలు తోడయ్యాయి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాల మహిళలు వంటింటి బడ్జెట్‌ను నిర్వహించలేక సతమతమవుతున్నారు. కిలో కూరగాయలు కొనే వారికి అర కిలోతోనో, పావుకిలోతోనో సరిపెట్టుకోక తప్ప డం లేదు. దాంతో ఇంటిల్లిపాదికీ కడుపారా తినేందుకు కూర వండి పెట్టడం ఆ ఇల్లాళ్లకు ‘కత్తిపీట మీద సాము’గా మారింది. ఇంట వండిన కూర రుచిగా ఉన్నప్పుడు మారు వడ్డించమనడం ఎవరికైనా ఉన్న అలవాటే. అలా అడిగిన వారికి అడిగినంత కూర వడ్డించడం ఇప్పుడు ఇల్లాళ్లకు శక్తికి మించిన పనిగా పరిణమించింది. జిల్లాలో వారం, పదిరోజులుగా మడికి హోల్‌సేల్ మార్కెట్లో, చిల్లర వ్యాపారాల్లో కూరగాయల ధరలు రోహిణీ కార్తెలో ఉష్ణోగ్రతలాగే దినదినాభివృద్ధి చెందుతున్నాయి. బీర, క్యారెట్, బీట్రూట్ వంటి వాటి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. వీటి ధర కేజీ రూ.40 నుంచి రూ.42 వరకు ఉంది. కొన్ని చోట్ల బీర ధర రూ.45 కూడా దాటింది. టమాటా, బెండకాయలు కేజీ రూ.32 నుంచి రూ.35, క్యాబేజీ, వంకాయలు రూ.24 వరకు, బంగాళదుంప, దొండకాయ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. ఇక.. నగల తయారీలో బంగారానికి రాగి కలవడం ఎంత తప్పనిసరో.. ఏ కూర వండాలన్నా అంతే తప్పనిసరైన ఉల్లిపాయలు కూడా ‘మేము మాత్రం తక్కువ తిన్నామా’ అన్నట్టు ధర విషయంలో మిడిసిపడుతున్నాయి. వాటి నాణ్యతను బట్టి రూ.20 నుంచి 24 వరకు పలుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 సెంటీగ్రేడ్ డిగ్రీలకు పైబడి ఉండడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిందని, దానికి తోడు మండే ఎండల్లో కూరగాయల కోతకు వచ్చేందుకు కూలీలే జంకుతుండడంతో ఎక్కువ కూలి ఇచ్చి కోయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. కాగా మడికి హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రస్తుతం.. ఎప్పుడూ వచ్చే కూరగాయల్లో 60 శాతమే వస్తున్నాయని అక్కడి వ్యాపారులు చెపుతున్నారు. తొలకరి వర్షాలు పడి, ఉష్ణోగ్రతలు త గ్గి కాయగూరల దిగుబడి ఎంతోకొంత పెరిగే వరకూ ధరలు దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు. అంటే.. మరికొన్ని రోజులు కూడా రెండుపూటలా నోరారా తినడం అంటే సామాన్యుల జేబుకు మించిన భారం కాక తప్పదన్న మాట.