నెలలో ఒకరోజు ఫ్రీ వెహికిల్ డే
లోహిత్: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన సరి,బేసి విధానం అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నెలలో ఒక రోజు వాహనాలను వాడకుండా ఉండాలని అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతీ నెల ఏడవ తేదీన ఫ్రీ వెహికిల్ డే ను పాటించాలని నిర్ణయించారు. ఈ రోజు నడక, సైకిల్ పై గానీ ప్రయాణించాని నిర్ణియించారు. ఇందుకోసం ఎవరిని ఒత్తిడి చేయదలచుకోలేదని పర్యావరణం కోసం ప్రతి ఒక్క ఉద్యోగి స్వచ్చందంగా ముందుకు రావాలని లోహిత్ డిప్యూటీ కమిషనర్ దానిష్ అష్రఫ్ ఆదివారం తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రతీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి దీనిని పాటించాలని అష్రఫ్ కోరారు.