vehicles burned
-
రోడ్డు పనుల వాహనాల కాల్చివేత
మల్కన్‌గిరి : జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లాలో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వాహనాలను మావోయిస్టులు శనివారం కాల్చివేశారు. సుకుమ జిల్లాలోని రామారామ్ బడేష్ఠి గ్రామంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆ గ్రామానికి వచ్చిన మావోయిస్టులు పనులు జరుగుతున్న చోట సిబ్బందిని కొట్టి పంపించివేసి వాహనాలను కాల్చివేశారు. పొక్లెయిన్లు, మిక్సర్ మెషీన్, ట్రాక్టర్లకు మావోయిస్టులు పెట్రోల్ పోసి నిప్పంచించారు. ఎన్ని సార్లు హెచ్చరించినా రోడ్డు పనులు చేస్తున్నారని, మరోసారి ఈ ప్రాంతంలో రోడ్డు పనులు జరిగితే మరణ దండన విధిస్తామని హెచ్చరించారు. -
మావోయిస్టుల ఘాతుకం.. భారీ ఆస్తినష్టం
ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. దాదాపు మూడు కోట్ల విలువచేసే వాహనాలను తగలబెట్టారు. ఈ ఘటన గడ్చిరోలి జిల్లా సూరజ్ గఢ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 47 లారీలు, 4 జేసీబీలు, 2 ట్రాక్టర్లు, 2 రోడ్డ రోలర్లను మావోయిస్టులు అటవీ ప్రాంతానికి తరలించి అనంతరం వారి ప్లాన్ ప్రకారం వారిని తగలబెట్టి భారీ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని గడ్జిరోలి జిల్లా ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. దాదాపు 400 మంది సభ్యులుగా ఉన్న మావోయిస్టు గ్రూపు ఆ దారుణానికి పాల్పడి ఉంటుందని ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన బృందం అభిప్రాయపడింది. మావోయిస్టులు ఎందుకు ఈ విధ్వసానికి పాల్పడ్డారో ఇప్పటివరకూ తెలియరాలేదు.