vehicles caught
-
కార్డన్ సెర్చ్.. భారీగా వాహనాలు పట్టివేత
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు శుక్రవారం ఉదయం పట్టణంలో కార్డన్‌సెర్చ్ చేపట్టారు. సుమారు170 మంది పోలీసులు పాల్గొని, ప్రతి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 80 బైకులు, 2 ట్రాలీ ఆటోలను, రెండు కార్లతో పాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులతో పాటు అరెస్టు వారెంట్ ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుకున్నారు. ఎస్పీ అనంత్‌శర్మ నేతృత్వంలో ఈ సోదాలు చేపట్టారు. -
ఇసుక తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
కొవ్వూరు: నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామం వద్ద పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కొవ్వూరు ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఆకస్మికంగా దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక వ్యాపారులు పెన్నా నది నుంచి రాత్రి సమయాల్లో ఇసుక తరలిస్తుంటారు. స్వాధీనం చేసుకున్న 25టైర్ల వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.