వాహనశ్రేణితో ట్రయల్స్
హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు పలుమార్లు
భారీగా మోహరించిన పోలీసు బలగాలు
వర్గల్: ప్రధాని నరేంద్రమోదీ మరికొద్ది గంటల్లో కాలు మోపనుండడంతో నెంటూరులోని హెలిప్యాడ్ సముదాయం వద్ద హడావిడి పెరిగింది. శనివారం వాహన శ్రేణితో పలుమార్లు హెలిప్యాడ్ నుంచి ప్రారంభోత్సవ వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. మరోవైపు ఎక్కడికక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. చౌదరిపల్లి క్రాస్‌రోడ్డు నుంచి నెంటూరు హెలిప్యాడ్ మార్గం వరకు పటాన్చెరు సీఐ రాజేష్ పర్యవేక్షిస్తున్నారు.
నెంటూరు నుంచి హెలిప్యాడ్ వైపు వెళ్లే మార్గంలో ఒక ఎస్ఐతో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ వందలాది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మూడు అగ్నిమాపక వాహనాలు, 108 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ఎస్పీజీ అధికారులు సమీక్షించుకుంటూ తగు సూచనలిస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా రైతుల క్షేత్రాల్లో బందోబస్తులో ఉన్న పోలీసులు కన్పిస్తున్నారు.