రాష్ట్ర స్థాయి ఆటలపోటీలకు వేళంగి విద్యార్థులు
వేళంగి(కరప):
రాష్ట్ర స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనేందుకు వేళంగి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారు. జిల్లా స్కూలుగేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల గ్రౌండ్లో అండర్–19 విభాగంలో క్రికెట్, అథ్లెటిక్స్ అంశాలలో జరిగిన ఎంపికలో తమ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ ఎస్వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. అథ్లెటిక్స్ 1500 మీటర్ల రన్నింగ్ పోటీలకు కె.శ్రీనివాస్ (ద్వితీయ ఎంపీసీ), టి.తేజ, ఎం.ప్రశాంతకుమార్(ప్రథమ ఎంపీసీ)లు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారని కళాశాల పీడీ జే.రఘురాం తెలిపారు.