velpur village
-
తెలంగాణ అబ్బాయి బంగ్లాదేశ్ అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు
నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గుమ్మల హరీష్‌కు, బంగ్లాదేశ్‌కు చెందిన రోషి (రోషిణి) అనే అమ్మాయితో ఆదివారం వెంకటాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమ్మల హరీష్ ఐదేళ్ల క్రితం ఉపాధికోసం జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అక్కడికే ఉపాధికోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రిషి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురు ఇష్టపడి నాలుగేళ్ల కింద జోర్డాన్‌లోనే పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల కింద హరీష్ ఇంటికి వచ్చాడు. కోవిడ్ వల్ల తిరిగి జోర్డాన్ వెళ్లలేకపోయాడు. పాస్‌పోర్డు రెన్యూవల్ ఉండడం, కోవిడ్ పరిస్థితుల వల్ల అమ్మాయి కూడా వేల్పూర్‌కు రాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో నెలరోజుల కింద రోషి వేల్పూర్‌లోని హరీష్ వద్దకు చేరింది. దీంతో తమ సమక్షంలో పెళ్లి జరిపాలని హరీష్ తల్లిదండ్రులు గుమ్మల యాదగిరి, కమల, బంధువులు నిర్ణయించారు. ఆదివారం మంచి ముహూర్తం ఉండడంతో మండలంలోని వెంకటాపూర్ వేంకటేశ్వర ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా కుటుంబీకులు, బంధుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఐదుగురు మృతి
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ కారు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పడగల్ వద్ద లారీ - కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో కారులో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందారు. రహదారిపై వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు.