వెనిజులాలో ప్రతిపక్ష పార్టీ విజయం
కారకస్: వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ యూనిటి రౌండ్‌టేబుల్ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఎంయూడీ సాధించినట్టు ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది.
వెనిజులా ప్రజలు అధ్యక్షుడు నికోలస్ మడురోకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. జాతీయ అసెంబ్లీలో 167 సీట్లు ఉండగా ఆదివారం నాటికి ప్రతిపక్ష ఎంయూడీ 99 సీట్లు గెలిచింది. అధికార యునైటెడ్ సోషలిస్ట్స్ పార్టీ ఆఫ్ వెనిజులా 46 సీట్లకు పరిమతమైంది. మరో 22 స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సివుంది.